మునుగోడు టిక్కెట్ పై కేసీఆర్ పునరాలోచన చేయాలి…!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులపై వివక్షతను విడనాడీ,ముఖ్యమంత్రి కేసీఆర్ ( Kcr )మునుగోడు నియోజకవర్గ టికెట్ పై పునరాలోచన చేసి,మునుగోడు ఎమ్మెల్యే టిక్కెట్ ముదిరాజులకు కేటాయించాలని నల్గొండ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్ డిమాండ్ చేశారు.

బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో మనీ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో 33,500 ఓట్లు ముదిరాజ్ లవి ఉన్నాయని,రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులను గుర్తించకపోవడం,ఒక టిక్కెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో ఒక్క ముదిరాజ్ ఓటు కూడా మమ్ములను గుర్తించని పార్టీకి పడదని,కేసీఅర్ పట్టు విడవకపోతే ఓటమిని చవిచూడక తప్పదని హెచ్చరించారు.

జాతి ఐక్యత కోసం ముదిరాజులంతా పోరాడాలని,మన జాతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని,లేదంటే భావితరాలకు శూన్యమే మిగులుతుందని చెప్పారు.

నియోజకవర్గ ముదిరాజులంతా పార్టీలకు అతీతంగా సమాయత్తం కావలసిన అవసరం ఉందని,త్వరలో నియోజకవర్గ ముదిరాజుల ఆత్మీయ సమావేశం ఉంటుందని,పార్టీలకతీతంగా అన్ని బీసీ,ఎస్సీ,ఎస్టీ కులాలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల్లో నిలపాలని ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాయిత వెంకన్న ముదిరాజ్,జెట్టి గణేష్ ముదిరాజ్,వనం లింగయ్య ముదిరాజ్, సురా శంకర్ ముదిరాజు, వీరమల్ల సైదులు ముదిరాజ్,పండుగ అశోక్ ముదిరాజ్,ఆకుల అనిల్ ముదిరాజ్,నారబోయిన జగన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన సింహం.. తర్వాతేమైందో చూడండి..