టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిబంధనలు పెట్టిన కేసీఆర్

ఈ మధ్యకాలంలో ఏ కారుపై చూసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి.ఇది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఆ స్టిక్కర్ ఉండడంతో ఆ వాహనాలపై పోలీసులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు దీంతో అందులో అసాంఘిక కార్యకలాపాలు అధికంగా జరుగుతుంది.

ఇటీవలే హైదరాబాదులో గ్యాంగ్ రేప్ ఘటనలో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం విశేషం.ఇలాంటి వాటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి నివారణపై దృష్టి సారించింది.

ప్రతీ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో ఒక్కో సభ్యుడికి 3 స్టిక్కర్లు ఇస్తుంది ప్రభుత్వం.

అవి పనికి రాకుండా పోతే మరో రెండు స్పీకర్లు ఇస్తుంది.అంటే మొత్తం 5 స్టిక్కర్లు ఇస్తుందన్నమాట.

స్టిక్కర్లు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లు దుర్వినియోగం అవుతున్నాయని చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది.

తాజాగా క్యాసినో వివాదంలో ప్రధాన నిందితుడైన మాధవ రెడ్డి ఇంట్లోని కారుపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉంది.

గత మార్చి వరకే దాని సమయం గడువున్నా ఇప్పటికీ ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ కారు మీదే ఉంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా ఈ స్టిక్కర్ లు ఉన్నాయి.

ఇకపై ఎమ్మెల్యేలకి ఇచ్చే స్టిక్కర్లపై ఎమ్మెల్యే పేరు తో పాటు కార్ నంబర్ కూడా ఎంట్రీ చేయనున్నారు.

ఆ స్టిక్కర్ కు గడువు తేదీ పెడతారు.గడువు తేదీ ముగిసినా పాత స్టిక్కర్ కొనసాగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏసీపీ స్థాయి అధికారిని నియమించారు.

ఈ విషయం ఇప్పటికే సీఎం నుండి వెలువడింది.అయితే అసెంబ్లీలో మరొకసారి సభ్యులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

తాజా నిర్ణయంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్ ఎవరు పడితే వాళ్ళు వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు.

ఒకవేళ వినియోగిస్తే అది క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు.గతంలో ఆ స్టిక్కర్లను పెట్టుకుని చాలామంది అరాచకాలకు పాల్పడిన విషయం తెలిసిందే.

అందులో ఉండేవారు తామే ఎమ్మెల్యేలం అన్నట్టు పోలీసులతో మాట్లాడడం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.

ఇలాంటి వారికి ఇక చెక్ పడే ఆస్కారం ఉందని అనుకుంటున్నారు జనం. """/"/ ప్రతీరోజు వందల సంఖ్యలో కార్లు, వాహనాలకు ఈ స్టిక్కర్లు ఉంటున్నాయి.

గతంలోని ప్రభుత్వాలు కొన్నిసార్లు నిబంధనలు కఠినతరం చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

అయితే ఈ సారి మాత్రం క్రిమినల్ కేసులకు ప్రభుత్వం ఆదేశించడంతో చాలా వరకు భయం పెరిగి కేవలం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు మాత్రమే ఈ స్టిక్కర్లు వినియోగించే ఆస్కారం ఉంది.

మరి దీని మీద ఎమ్మెల్యేల అభిప్రాయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.