చావునోట్లో తలపెట్టను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసీఆర్!

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పై తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చావు నోట్లో తల పెట్టని కేసీఆర్ వారికి లొంగుతాడా అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ తాను అధికారం లో లేని రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తుంది.ఇప్పటికే వాళ్ళు రాష్ట్రాలను సొంతం చేసుకోవాలని చెయ్యని ప్రయత్నం లేదని తెలంగాణ లో అలాంటి పప్పులు ఏం ఉడకవని ఆయన అన్నారు.

కేసీఆర్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదని గుర్తుంచుకోవాలి ,ఇతర పార్టీల ప్రభుత్వాలను కులదోసి, తమ పార్టీ ని అన్ని రాష్ట్రాల్లో అధికారం లోకి తేవాలని కేంద్రం ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నం మధ్యప్రదేశ్ , గోవా, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఫలించింది కాని రాజస్థాన్ లో ఇది ఫలించలేదు అలాగే మహారాష్ట్రలోను చేతులు కాల్చుకున్నారని ఆయన చెవుకొచ్చారు.

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో ఉన్న వివాదాలు పరిష్కారానికి చొరవ ప్రదర్శించలేదని ఆయన గుర్తు చేశారు.

ఈ స్థితి లో కేంద్రంతో పోరాటం తప్ప వేరే మార్గం లేదని ఆయన అన్నారు.

మరి దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

చిచ్చరపిడుగుల క్రియేటివిటీ మాములుగా లేదుగా.. ‘అతడు’ సీన్ వైరల్