అమరావతికి రాబోతున్న 'రిటర్న్ గిఫ్ట్' ! ఫిబ్రవరి 14 న 'ముహూర్తం'

తెలంగాణ సీఎం కేసీఆర్.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఒక పట్టాన వదిలేలా కనిపించడం లేదు.

తన కోపం కసి అంత తీర్చుకునేలా ప్లాన్ వేసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్ కు సపోర్ట్ చేయడం ద్వారా బాబును ఇరుకున పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో జగన్ కు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చూస్తున్నాడు.

అవసరమైతే టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ తరఫున జగన్ కు మద్దతుగా ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తన ఇగో హర్ట్ అయ్యేలా వ్యవహరించారు కాబట్టి చంద్రబాబు కి దిమ్మ తిరిగేలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కేసీఆర్ చూస్తున్నాడు.

నిన్న జగన్ తో కేటీఆర్ భేటీ అయ్యి అనేక రాజకీయ అంశాల గురించి చర్చలు జరిపాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇక కేసీఆర్ అయితే .వచ్చే నెలలో అమరావతికి వెళ్లి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ కి సంబంధించి శాంపుల్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

అందుకే.విజయవాడ వెళ్లి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చంద్రబాబును విమర్శిస్తానని చాలెంజ్ చేశారు.

దాని ప్రకారం.ఇప్పుడు దానికి ఒక ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు.

ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన కొత్త మిత్రుడు.వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి.

ఆయన.విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడేందుకు షెడ్యూల్ సిద్ధం చేసుకున్నాడు.

అంతే కాకుండా.ఫెడరల్ ఫ్రంట్ తరువాతి చర్చలు.

అమరావతిలో జరపాలని నిర్ణయించుకున్న జగన్, కేసీఆర్.దానికోసమే ఈ డేట్ ఎంచుకున్నారు.

అమరావతిలో వైఎస్ జగన్ నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన జరగనుంది.

ఆ కార్యక్రమాన్ని కేసీఆర్ హాజరు కాబోతున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇక్కడే జగన్ కేసీఆర్ మధ్య రాజకీయ చర్చలు మొదలయ్యి.

చంద్రబాబు మీద ఎక్కుపెట్టాల్సిన బాణాలు గురించి చర్చలు జరపబోతున్నారు.ఇక అక్కడి నుంచి బాబు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఆయన మీద విమర్శల దాడి చేసేలా కేసీఆర్ ప్లాన్ వేస్తున్నాడు.

అసలు జగన్ కేసీఆర్ కి ఇంత బాగా దగ్గర అవ్వడానికి కారణం .

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ప్రకటన కేసీఆర్ తన వ్యూహాలతో చంద్రబాబును ఓడించగలరన్న నమ్మకం జగన్ లో బాగా బలపడించి.

అందుకే కేసీఆర్ సలహాలు సూచనలతో బాబు ను ఇరుకునపెట్టి సీఎం కుర్చీ దక్కించుకోవాలని జగన్ చూస్తున్నాడు.

కేసీఆర్ ఫిబ్రవరి 14 న రాబోతున్నందున తెలుగుదేశం కూడా ఆ విమర్శలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది.

అందుకే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కేసీఆర్ ను టార్గెట్ చేసుకోవాలని చూస్తోంది.

అయితే ఇప్పటికే హోదా విషయంలో కేసీఆర్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వడంతో ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.

నేడు తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల