వచ్చే విస్తరణలో మంత్రివర్గంలో మహిళలకి స్థానం! అసెంబ్లీలో కేసీఆర్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జోరుగా ప్రతిపక్ష పార్టీల విమర్శలు, అధికార పార్టీ సమాధానాలతో కొనసాగింది.

ఈ అసెంబ్లీ సమావేశాలలో ముందుగా ప్రతిపక్ష పార్టీ నేతలు కేసీఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విమర్శలు చేసారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమంత ఆశాజనకంగా లేవని, పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెడితే బాగుండేది అని అన్నారు, అలాగే మంత్రి వర్గంలో కనీసం మహిళలకి స్థానం కల్పించకపోవడం దురదృష్టకరం అని విమర్శించారు.

ప్రతిపక్షాల విమర్శలకి సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తుందని, బడ్జెట్ కేటాయింపులు అన్ని సంక్షేమం కోసం ఏర్పాటు చేసామని, అలాగే బడ్జెట్ కేంద్రం నుంచి సహకారం అందకపోయినా అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రెడీ అయ్యామని చెప్పారు.

అలాగే మళ్ళీ త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, అందులో ఇద్దరు మహిళలకి స్థానం కల్పిస్తామని కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలలో చెప్పుకొచ్చారు.

రేపు పాతబస్తీలో అమిత్ షా పర్యటన..!