కొరివితో తల గోక్కోవడం అంటే ఇదేనేమో ?

మరికొద్ది రోజుల్లో ఏపీ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగేలా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా అధికార పార్టీ టిడిపి ఇప్పుడు ముప్పేట దాడి తో తీవ్ర ఇబ్బందులు పడుతుంది.

రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రచారంలో దూసుకు పోవాల్సిన టిడిపి తమపై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పుకోవడానికే సమయం అంతా కేటాయిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా డేటా చోరీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని సిట్ కు ఆ బాధ్యతలు అప్పచెప్పింది.

ఈ వ్యవహారంలో టిడిపి పూర్తిగా డైలమాలో పడిపోయింది.ఈ కేసు ఎక్కడ తమ పీకలకు చుట్టుకుని ఎన్నికల్లో తీరని నష్టం చేకురుస్తుందో అన్న ఆందోళన మొదలైంది .

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అసలు కేసీఆర్ చంద్రబాబు ప్రభుత్వం పై ఈ స్థాయిలో రాజకీయ కక్ష సాధించడం వెనుక కారణాలు ఆరా తీస్తే చంద్రబాబు చేసిన తప్పిదాలు కూడా కనిపిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ తో అనవసర వైరం పెట్టుకుని బాబు రాజకీయంగా సాధించింది ఏమీ లేదు.

తెలంగాణలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ తో చేతులు కలిపి కేసీఆర్ పై బాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేసాడు.

అలాగే టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయాలని చూసాడు.అయితే కేసీఆర్ హవా ముందు బాబు ఎత్తులు పని చేయలేదు.

టిఆర్ఎస్ ఊహించిన స్థాయిలో మెజార్టీ స్థానాలు సాధించింది.టిడిపి రెండంటే రెండు సీట్లు విజయం సాధించింది.

అయితే చంద్రబాబు చేసిన విమర్శలు కేసీఆర్ లో బలంగా నాటుకుపోయాయి.ఇప్పుడు కేసీఆర్ ప్రధాన శత్రువు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అందుకే చంద్రబాబును ఇరుకున పెట్టే అవకాశం కోసం ఎదురు చూస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇప్పటికే టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసిపిలోకి వెళ్ళే కేసీఆర్ తెర వెనుక రాజకీయం చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం టీడీపీలో కాక రేపుతున్న డేటా చోరీ కేసును ఓటుకు నోటు కేసు మాదిరిగానే బాబు చుట్టూ బుజ్జగించి మరోసారి అధికారం దక్కకుండా చేయాలని అని కెసిఆర్ భావిస్తున్నాడు.

మొత్తం ఈ వ్యవహారంలో చూస్తే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో అనవసరంగా వేలుపెట్టి ఇంతవరకు తెచ్చుకున్నాడనే విమర్శలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

స‌మ్మ‌ర్ లో బాడీ హీట్ ను మాయం చేసే టాప్ అండ్ బెస్ట్ ఫుడ్స్ ఇవే!