నేడు కేసీఆర్ సభ ! ఒక పక్క ఏర్పాట్లు మరో పక్క ఆందోళన

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ వేదికగా ప్రకటించబోతున్నారు.

ఈ దళిత బంధు పథకాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఒక దళిత కుటుంబానికి 10 లక్షలు అందించడం ద్వారా, టిఆర్ఎస్ కు తెలంగాణలో తిరుగు లేకుండా చేసుకోవాలని, ఆ సామాజిక వర్గం పూర్తిగా టిఆర్ఎస్ వైపు ఉండేలా చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.త్వరలోనే ఇక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కెసిఆర్ ముందుగానే అలర్ట్ అయ్యి ఈ భారీ బడ్జెట్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.

ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈ దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద కెసిఆర్ ప్రారంభిస్తున్నారు.

ముందుగా ఈ పథకానికి అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కెసిఆర్ అందించనున్నారు.

దీనికోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసింది.ఈ పథకం ను సక్సెస్ ఫుల్ గా అమలు చేసి తీరుతామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది.

ఈ మేరకు హుజురాబాద్ లో కెసిఆర్ భారీగానే అధికారులు ఏర్పాట్లు చేశారు.ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సభ జరగనుంది.

సుమారు వంద అడుగుల పొడవు, 43 అడుగుల వెడల్పుతో భారీ వేదిక సైతం ఏర్పాటు చేశారు.

ఈ ఏర్పాట్లు అన్ని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గం లోని మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి భారీ ఎత్తున జనాలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.

"""/"/ ఈ సభలోనే కెసిఆర్ రైతు బంధు పథకంతో పాటు, హుజురాబాద్ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించి ఈటెల రాజేందర్ పై ఘాటు విమర్శలు చేసేలా కనిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే,  ఈ దళిత బంధు పథకం అధికారికంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.

ఈ పథకాన్ని హుజురాబాద్ లో మొదలు పెట్టడంతో తమ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని, ముందుగా హుజురాబాద్ వరకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో తమ నియోజకవర్గాల్లో పరిస్థితి తమకు ఇబ్బందికరంగా మారుతుందని, అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలనే డిమాండ్ మొదలవ్వడం వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో తమకు పెద్ద ముప్పే తీసుకొస్తాయని, ఈ పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో తమ గెలుపు పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనే టెన్షన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల్లో నెలకొంది.

మన మీడియం రేంజ్ హీరోలను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్స్…