అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్!
TeluguStop.com
సమయోచిత నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడిని పేరుపొందిన కేసీఆర్ మరో మారు తనను ఎందుకు రాజకీయ చాణిక్యుడు అని పిలుస్తారో మరొకసారి నిరూపించుకుంటున్నారు .
ఇంత కాలం ప్రతిపక్షాల విమర్శలపై ఆచితూచి స్పందిస్తున్న కేసీఆర్ సరిగ్గా ఎన్నికల ముంగిట శరవేగంగా నిర్ణయాలను తీసుకుంటూ ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు.
తమ సంక్షేమ పథకాల ( Welfare Schemes )లబ్ధిదారుల ఓట్ బ్యాంక్ సంతృప్తికర స్థాయిలోనే ఉన్నప్పటికీ ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని మరిన్ని వర్గాలను సంతృప్తిపరిచే పనులను చేపట్టారు .
ప్రభుత్వం వ్యతిరేకత ప్రబలిన అంశాలను గుర్తిస్తూ తిరిగి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు .
"""/" /
దీనిలో బాగం గానే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని గ్రహించిన కేసీఆర్ (CM KCR ) వారిని పూర్తిస్థాయి సంతృప్తి పరిచే విధంగా ఏకంగా ప్రభుత్వంలోనే కలిపే నిర్ణయం తీసుకున్నారు .
దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన ఖాతరు చేయడం లేదు .
ఇప్పుడు మరో ప్రధాన వర్గమైన రైతులను సంతృప్తి పరిచే పని ని మొదలుపెట్టారు.
సగంలో ఆగిపోయిన రైతు రుణమాఫీ( Farmer Loan )ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు.
అయితే ఇంతకాలం ఆలస్యం అవ్వడానికి కేంద్రం తీసుకున్న విధానాలు నోట్ల రద్దు , కరోనా మరియు తెలంగాణ పై కేంద్రం చూపిస్తున్న వివక్ష ఆలస్యానికి కారణమని వివరించిన కేసీఆర్ ఇప్పుడు రైతుబంధు పథకం లాగానే విడతల వారీగా రుణమాఫీని అమలు చేస్తామని సెప్టెంబర్ వరకు పెండింగ్లో ఉన్న 19 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ప్రకటించి ఆ వర్గాలను ఆకట్టుకుంటున్నారు.
"""/" / ప్రభుత్వ వైఫల్యాలను భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రభుత్వాన్ని దెబ్బ కొడదామని ఒకవైపు కాంగ్రెస్( Congress Party ) మరోవైపు భాజపా కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటుంటే ప్రజల్లోని ప్రదాన వర్గాలకు వరాల జల్లులు కురిపిస్తూ కేసీఆర్ ప్రతిపక్షాల ఆశలపై నీళ్ళు జల్లే స్తున్నారనే చెప్పాలి.
అంతేకాకుండా రాబోయే మూడు నెలల కాలంలో మరిన్ని వర్గాలను ఆకట్టుకునే పనికి శ్రీకారం చుట్టారని ప్రతిపక్షాలు ఊహించలేనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వాళ్ళని చావు దెబ్బ కొట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది .
మరి కేసీఆర్ ఇచ్చే షాకులకు ప్రతిపక్షాలు ఎలా ప్రతిస్పందిస్తాయో చూడాలి.
అట్లీ లుక్ పై కామెంట్లు చేసిన బాలీవుడ్ కమెడియన్.. ఈ బాలీవుడ్ నటుల తీరు మారదా?