వారిపై ‘లక్ష ‘ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న కేసీఆర్ !
TeluguStop.com
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ( CM KCR )తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే విధంగా వరాల జల్లులు కురిపిస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా అండదండలు తమకు ఉండే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.ఇప్పటికే తెలంగాణలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఒక్కో కుటుంబానికి 10 లక్షల సాయం అందించే విధంగా ప్లాన్ చేశారు.ఇప్పటికే కొంతమందికి ఈ పథకాన్ని అందించారు.
ఇంకా అందాల్సిన వారు చాలామంది ఉన్నారు.అయితే ఈ దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత బీసీ సామాజిక వర్గాల్లో అసంతృప్తి మొదలవడం, తమకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయడం లేదనే భావన ఏర్పడడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ ,రాబోయే ఎన్నికల్లో బీసీల మద్దతు తమకు ఉండే విధంగా ప్లాన్ చేశారు.
దీనిలో భాగంగానే బీసీ సామాజిక వర్గంలో కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఆర్థికంగా అండదండలు అందించేందుకు లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించారట.
"""/" /
ఈ పథకం అమలు, నిబంధనలు వంటివి ఖరారు చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar )అధ్యక్షతన క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ సబ్ కమిటీ నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ప్రోత్సాహాలు అందించే విధంగా ఏమేం చేయాలనే దానిపై విధివిధానాలను రూపకల్పన చేస్తుంది.
ఈ సబ్ కమిటీ విధి విధానాలు ఖరారు చేస్తే, దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు.
జూన్ రెండవ తేదీ నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు భారీగా ఈ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు.
దీనికోసం 200 కోట్ల వరకు కేటాయింపులు చేశారు.ఈ ఉత్సవాలు ప్రారంభం రోజునే రాష్ట్ర మంత్రులు ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
"""/" /
దశాబ్ది ఉత్సవాల్లో బీసీలకు లక్ష చొప్పున సాయం అందించే పథకాన్ని ప్రారంభించబోతున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా , ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి ఎటువంటి అర్హతలు పెట్టలేదు.
అందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది.ఇప్పటికే కొంతమందికి ఇచ్చినా, ఇంకా ఇవ్వాల్సిన వారు చాలామంది ఉన్నారు.
మరి ఇప్పుడు కొత్తగా బీసీ బందు( BC Bandhu ) ప్రవేశ పెట్టబోతూ దానికి అర్హతలు పెడితే వివాదం ఏర్పడే అవకాశం ఉంది.
అంతేకాకుండా దళిత బంధు కింద పది లక్షలు సాయం అందించి బీసీలకు కేవలం లక్ష మాత్రమే ఇవ్వడం పైన అసంతృప్తులు చెలరేగే అవకాశం ఉంది.
అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత సాయం అందించగలిగామనే సంతృప్తి తో పాటు, లక్ష అందించినా, ఆ వర్గంలో బీఆర్ఎస్ పై సానుకూలత ఏర్పడుతుందనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.
ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో అసలు ట్విస్ట్ ఇదేనా.. సినిమా అలా ఉండబోతుందా?