గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది..? కారు రివర్స్ అవుతోందా ..?
TeluguStop.com
తెలంగాణాలో తనకు ఎదురులేకుండా చేసుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బడా నేతలతోపాటు చోటామోటా నాయకులను కూడా కారెక్కించేసి పార్టీని జంబోజెట్ చేసేసాడు.
అంతే కాదు మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో మళ్ళీ అదే వ్యూహానికి పదునుపెట్టి కొంతమంది నేతలను పార్టీలో చేర్చుకుని సంబరపడ్డాడు.
అయితే ఇప్పుడు మారిన రాజకీయపరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ పధకం బెడిసికొట్టేలా ఉండడంతో గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ముఖ్యంగా టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు తిరిగి సొంతగూటికి చేరబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.