చంద్రబాబు బాటలోనే కేసీఆర్..? చిక్కులు తప్పవా..?
TeluguStop.com
వారిద్దరిది వేర్వేరే పార్టీలు, ప్రాంతాలు కూడా వేరు వేరే.కానీ వారిద్దరూ గురువు శిష్యులే.
ఇంతకీ ఎవరని అను కుంటున్నారా? వారేనండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.
ఉమ్మడి ఏపీలో తిరుగులేని రాజకీయనేతగా పేరు గడించారు చంద్రబాబు.తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తన రాజకీయ అనుభవంతో ఏపీలో అధికారం చేపట్టాడు చంద్రబాబు నాయుడు.
కానీ 2019 ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యారు.అయినా ప్రస్తుతం పార్టీని నిలబెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
అంత అనుభవం ఉండి కూడా పరిపక్వత లేని రాజకీయాలు చాలానే చేశారు.ఎన్నో తప్పులు సైతం చేశారు.
దాని వల్ల ప్రస్తుతం విపక్ష నేతగా మిగిలి పోయారు.పార్టీకోసం ప్రస్తుతం ఆయన అహర్నిషలు శ్రమిస్తున్నారు.
ఇదే ఊపు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపొందడం ఖాయమనే చెప్పాలి.ఇదిలా ఉండగా.
అప్పట్లో బీజేపీని వ్యతిరేకించి తప్ప చేశానా? అనే ఆలోచన ఆయనలో ఎన్నో సార్లు మెదిలింది.
అప్పట్లో ఆయన తీసుకున్న తొందర పాటు నిర్ణయం వల్ల పార్టీ ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో కూరుకు పోయింది.
అప్పుడు చంద్రబాబు చేసిన తప్పులనే ప్రస్తుతం కేసీఆర్ సైతం చేస్తున్నారు.అందులో పెద్దది బీజేపీని వ్యతిరేకించడం.
"""/" /
కేసీఆర్ సైతం ఇలాగే మొండిగా కేంద్రానికి వ్యతిరేకంగా వెళితే త్వరలోనే దర్యాప్తు సంస్థలో ఉచ్చులో చిక్కుకోవడం ఖాయమని స్వయంగా బీజేపీ వర్గాలే హెచ్చరిస్తుండటం గమనార్హం.
ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో, కాళేశ్వరం ఎత్తిపోత ప్రాజెక్టులోని అవినీతిపైనా కేంద్రం నిఘా వర్గాలను ఇప్పటికే అలెర్ట్ చేసింది.
ఇక ఆయన ఇమేజ్ ను బీజేపీ డ్యామేజ్ చేయడం ఖాయమని తేలింది.అప్పట్లో గురువు చేసిన తప్పిదాలే ఇప్పుడు శిష్యుడు సైతం చేస్తున్నాడా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గురువుకు ఎదురైన పరిణామాలను కేసీఆర్ గుర్తుచేసుకోవడం లేదా అంటూ చర్చించుకుంటున్నారు.మరి కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుందో చూడాలి.
నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!