కర్ణాటక ఎన్నికలకు దూరం అంటున్న బారాసా ……వ్యూహం ఇదేనా?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఉత్సాహం లో ఉన్న కెసిఆర్( KCR ) టిఆర్ఎస్ ను బి ఆర్ ఎస్ మార్చిన కొత్తల్లో టార్గెట్ చేసిన కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి.

తెలుగువారు అధికంగా ఉండటం ఒక కారణమైతే తెలంగాణకు సరిహద్దుగా ఉండటం వల్ల ప్రభావం చూపించవచ్చని ఆయన లెక్కలు కట్టారు.

అక్కడ జెడిఎస్ ప్రభుత్వంతో కూటమి గట్టి ముందుకు వెళ్లాలని ప్లాన్ చేశారు ఆ దిశగా కొన్ని పరిణామాలు కూడా జరిగాయి.

"""/" / అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు గానీ కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో ( Karataka )పోటీ చేయట్లేదు అని ఆ పార్టీ ప్రకటించింది.

అయితే మరికొద్ది నెలలోనే తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నాయి ఈ సమయంలో పూర్తి స్తాయిలో సిద్ధమవ్వకుండా ఆ రాష్ట్ర ఎన్నికలలో వేలు పెట్టడం రిస్కు తీసుకోవడం అన్న భావన ఆ పార్టీ అధినేత లో కలిగిందని ,ఒకవేళ ఎన్నికలలో సరైన ఫలితాలు రాకపోతే ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికలలో కూడా ఉంటుందని కేసీఆర్ కి ప్రజాదరణ తగ్గింది అనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఇది మరొకసారి తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బారాస పార్టీకి మంచిది కాదని పార్టీ వ్యూహాత్మక సలహాదారుల సూచనలతో కర్ణాటక ఎన్నికలలో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది """/" / ఇప్పుడు కేవలం మిత్రపక్షంగా తెలుగువారు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో తన మంత్రులు కొంతమందిని పంపించే ప్రచారం చేయడం ద్వారా జెడిఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తాజా సమాచారం .

కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 10 నుంచి ఎన్నికలు జరగనున్నాయి.ఫలితాలు కూడా మే 13న ప్రకటిస్తారు.

మరి గట్టిగా రెండు నెలలు కూడా లేని ఎన్నికల్లో వేలు పెట్టడం ఎందుకని భరోసా( BRS ) తీసుకొని నిర్ణయం మంచిదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే కేంద్రంలో భాజాపాతో అమితుని తేల్చుకోవడానికి సిద్ధమైన కేసీఆర్ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ప్రత్యర్ధి కి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందని.

అందువల్ల తక్కువ సమయం ఉందన్న కారణం చెప్పి పోటీనుంచి తప్పుకోవడమే సహే తుకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే!