బీఆర్ఎస్ నుంచి వలసలు… కొత్త ఎత్తులు వేస్తున్న కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ కు( BRS ) చెందిన కీలక నేతలుగా గుర్తింపు పొందిన వారంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.

ఇప్పటికే కడియం శ్రీహరి, కే.కేశవరావు, గద్వాల విజయలక్ష్మి, ఇంకా అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, బిఆర్ఎస్ లో చేరిపోయారు.

బీఆర్ ఎస్ లో వివిధ కీలక పదవులు అనుభవించిన నేతలు ఎంతోమంది కాంగ్రెస్ లోకి( Congress ) వెళ్లిపోతుండడం, క్రమక్రమంగా బీఆర్ఎస్ బలహీనమైనట్లుగా పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ( KCR ) కాస్త ఆందోళన చెందుతున్నారు.

ఈ వలసలను నివారించి, పార్టీ బలహీనం కాకుండా ఏం చేయాలనే విషయంపై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావులతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.

"""/" / నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా ? ఎవరెవరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఇలా అనేక వివరాలను ఆరా తీస్తున్నారు.

పార్టీ నుంచి వలస నివారించేందుకు పార్టీ కార్యక్రమాల్లో నాయకులను భాగస్వామ్యం చేస్తున్నారు.రైతుల పంటల పరిశీలనతో పాటు, పార్లమెంటు ఎన్నికలకు( Parliament Elections ) గ్రామ స్థాయి నుంచి ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు.

పార్టీలో ఏదో ఒక బాధ్యలతో కీలకంగా ఉండేలా చేస్తే వారు పార్టీ మారకుండా ఉంటారని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.

రైతుల పంటల పరిశీలనతో పాటు, పార్లమెంటు ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు.

"""/" / ఎండిన పంటల పరిశీలనతో రైతుల్లో పార్టీపై సానుభూతి వస్తుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

అలాగే ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ,సాగునీటి అంశాలు ఏ మేరకు కలిసి వస్తాయనే విషయం పైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

ప్రతి నియోజకవర్గంలో నూతన నాయకత్వం ఏర్పాటుపై కేసీఆర్ దృష్టి పెట్టారు.ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి వలస వచ్చిన నేతలంతా మళ్ళీ వెనక్కి వెళ్లిపోతుండడంతో చాలాచోట్ల నాయకత్వ లోటు ఏర్పడింది .

దీంతో ఉద్యమకారులతో పాటు ,యువ నాయకులకు పార్టీలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు వారి వివరాలు సేకరిస్తున్నారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు కీలక నేతలను తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నా.

రు అలాగే క్యాడర్ కు సైతం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

అస్సలు తగ్గేదేలే.. పుష్ప 2 పై వెంకీ మామ క్రేజీ రివ్యూ… ఏమన్నారంటే?