కేసీఆర్ వి కొత్త డ్రామాలు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త డ్రామాలకు తెర తీశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై ఆయన స్పందించారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు ఆడటం టీఆర్ఎస్ కు అలవాటని చెప్పారు.
తమ ఆస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కేసీఆర్ కుటుంబం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ఇతరులపై బురద జల్లడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు.
ఎవరైనా ఎదిగితే వాళ్ల ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారన్నారు.అనేక అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలను హైకోర్టు తప్పుబట్టిందని వెల్లడించారు.
How Modern Technology Shapes The IGaming Experience