KCR KRMB : ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై నేతలతో కేసీఆర్ భేటీ..!

తెలంగాణ భవన్( Telangana Bhavan ) కు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) చేరుకున్నారు.

కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఐదు ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు.

57 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మరియు పార్టీ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించడంపై బీఆర్ఎస్ నిరసన కార్యాచరణను రూపొందించనుంది.

"""/" / ఈ క్రమంలోనే దీనిపై కేసీఆర్ పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు.

అదేవిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా( Nalgonda District )లో ఈ నెల 13వ తేదీన నిరసన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

అలాగే అసెంబ్లీ సమావేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎక్స్‌క్లూజివ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పటి నుంచే!