ఆ జిల్లాలలో కేసిఆర్ మాస్టర్ ప్లాన్ ?
TeluguStop.com
బిఆర్‌ఎస్ అధినేత తెలంగాణ సిఎం కేసిఆర్( CM Kcr ) ఎన్నికలపై గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
సరిగ్గా ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఇకపై వేసే ప్రతి అడుగు కూడా వ్యూహాత్మకంగానే ఉండేలా చూసుకుంటున్నారు.
ముఖ్యంగా బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు సిఎం కేసిఆర్.
కచ్చితంగా గెలుపు గుర్రాలకే సీట్ల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే తేల్చి చెప్పారు కూడా.
దీంతో ఎవరికి సీట్లు దక్కుతాయి ? ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంచితే ప్రస్తుతం రెండు జిల్లాలపై కేసిఆర్ గట్టిగా ఫోకస్ చేస్తున్నారట """/" / అవే ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా.
ఈ రెండు జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ( Congress Party )నుంచి అధికార బిఆర్‌ఎస్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ.అటు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) బిఆర్‌ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కనివ్వనని శపథం చేస్తున్నారు.
దీంతో ఖమ్మం జిల్లాలో సత్తా చాటడం బిఆర్‌ఎస్ కు అంతా తేలికైన విషయం కాదు.
అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. """/" /
ఇక్కడ కాంగ్రెస్ తో పాటు ఇప్పుడిప్పుడే బిజెపి ( BJP Party )కూడా బలపడుతోంది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండలో సత్తా చాటడం కేసిఆర్ కు పెద్ద టాస్కే.
దీంతో ఈ రెండు జిల్లాల పరంగా సీట్ల కేటాయింపుపై కేసిఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారట.
ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని సీట్ల కేటాయింపు జరిపే అవకాశం ఉందట.
అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే ఆలోచన కూడా కేసిఆర్ చేస్తునట్లు వినికిడి.
ఎందుకంటే ప్రస్తుతం రెండు జిల్లాలలోని కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు అసహనంగా ఉన్నట్లు సమాచారం.
దీంతో మార్పు తప్పదనే ఆలోచనలో కేసిఆర్ ఉన్నడట.మరి ఈ రెండు జిల్లాలో కేసిఆర్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!