ఎమ్మెల్యేలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా ?

తెలంగాణలోని అధికార పార్టీ బారాసా( BRS Party )లో అవినీతి తారస్థాయికి చేరిందని వార్తలు వస్తున్నాయి ఎమ్మెల్యేలపై కేసీఆర్( CM KCR ) నియంత్రణ కోల్పోయారని 111 మంది ఎమ్మెల్యేలలో 45 మంది అవినీతిపరులు ఉన్నారని స్వయంగా ఆయనే ప్రకటించడం చూస్తే వారి అవినీతిపై ఆయనకు నియంత్రణ లేదా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి .

ఎక్కడికక్కడ అందినకాడికి ఎమ్మెల్యేలు ప్రజాదానాన్ని దోచుకుంటున్నారని, చెరువులు ,భూములు కబ్జా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి .

"""/" / ఇంతకాలం అధికార పార్టీకి తిరుగులేని వాతావరణం తెలంగాణలో ఉండేది .

అయితే క్రమంగా భాజపా పుంజుకోవటంతో తెలంగాణలో మరో పార్టీకి ఉనికికి అవకాశం ఏర్పడింది .

అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూడా తెలంగాణలో జూలు విదిలిచింది .

వచ్చే ఎన్నికలలో తమదే విజయం అని కాంగ్రెసు నాయకులు దీమాగా చెబుతున్నారు .

అంతేకాకుండా వైయస్సార్ టిపి కోదండరాం పార్టీ లాంటి చిన్న పార్టీలు కూడా తెలంగాణలో తమ ఉనికిని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లోబారసా టికెట్ రాక పోయినా కూడా ఏమీ పరవాలేదు అని ఏదో ఒక పార్టీలో టికెట్ తెచ్చుకోవచ్చు అన్న తెగింపుతోనే ఎమ్మెల్యేలు ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి .

"""/" / అంతేకాకుండా స్వయంగా కేసీఆర్ కూతురిపైనే( Mlc Kavith ) అవినీతి ఆరోపణల కేసులు ఉన్నాయని, ఆ పార్టీ మొత్తం అవినీతిమయం అయిపోయిందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి .

తమ సంక్షేమ పథకాల తో బలహీన వర్గాల్లోనూ రైతులలోనూ మంచి పేరు తెచ్చుకున్న భరాసా సర్కార్ అధికారం పై ధీమాగానే ఉంది .

దేశం మొత్తానికి మార్గదర్శకంగా నిలబడే పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న కెసిఆర్ రాష్ట్రంలో గెలిచి కేంద్రంలో కూడా చక్రం తిప్పాలన్న ఆశలు పెట్టుకున్నారు.

ప్రస్తుతానికి తెలంగాణలో పరిస్థితి గులాబీ దళానికి అనుకూలంగానే ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు అవినీతి అంశం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తుందని ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుని ఎమ్మెల్యేలు నియంత్రించకపోతే వచ్చే ఎన్నికలలో గెలుపు ఆ పార్టీకి కష్ట సాధ్యమవుతుందంటూ విశ్లేషణలు వస్తున్నాయి .

వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!