కేసీఆర్ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు..: మంత్రి పొన్నం

దక్షిణ భారత్ పై ప్రధానమంత్రి మోదీ విషం కక్కుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) అన్నారు.

తెలంగాణకు రావాల్సిన హక్కును లెక్కల్లో చూపుతున్నారని తెలిపారు.రొటీన్ గా వచ్చే దానిని లెక్కల్లో చూపడం అవివేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

కరీంనగర్ జిల్లాకు కేంద్రం నుంచి నిధులు తేలేదన్న ఆయన బండి సంజయ్, గంగుల కమలాకర్( Bandi Sanjay , Gangula Kamalakar ) ఇద్దరూ స్నేహితులని తెలిపారు.

వినోద్ ను ఓడించేందుకు గతంలో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.పేదల భూములు లాక్కున్నవారిని వదిలి పెట్టమని పేర్కొన్నారు.

అదేవిధంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని తెలిపారు.ఆగస్ట్ 15 వ తేదీ వరకు రూ.

2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.

చిన్న సినిమాలకు ఆదరణ తగ్గడానికి కారణం ఏంటి..?