ముందస్తు పై సైలెంట్ గా స్కెచ్ వేస్తున్న కేసీఆర్ ?

ముందస్తు పై సైలెంట్ గా స్కెచ్ వేస్తున్న కేసీఆర్ ?

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత బిజీగా మారిపోయారు .

ముందస్తు పై సైలెంట్ గా స్కెచ్ వేస్తున్న కేసీఆర్ ?

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆకాంక్షతో ఆయన వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే విషయంపైనే దృష్టి సారించారు.

ముందస్తు పై సైలెంట్ గా స్కెచ్ వేస్తున్న కేసీఆర్ ?

అలాగే ఒక్కో రాష్ట్రంలోనూ భారీ ఎత్తున పార్టీ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆయా రాష్ట్రాల్లోని కీలక నాయకులు అందరిని చేర్చుకునే వ్యూహానికి తెర తీశారు.

ఈ మేరకు కొన్ని టీంలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల్లో చేరికలను ప్రోత్సహించే విధంగా ఒకపక్క కసరత్తు మొదలుపెట్టారు.

  మరోవైపు తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల పైన ముందుగా దృష్టి సారించారు.

ఇక్కడ ఎన్నికల్లో గెలిస్తేనే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలు అవుతుందని కేసిఆర్ భావిస్తున్నారు.

అందుకే తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ ను మూడోసారి గెలిపించి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.

గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో కెసిఆర్ బాగా యాక్టివ్ అయ్యారు.విస్తృతంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లోనూ నియోజకవర్గాలను పర్యటిస్తున్నారు .

పెండింగ్ పనులు అన్నిటిని క్లియర్ చేస్తున్నారు . """/"/ సామాజిక వర్గాల వారీగా మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

కీలక నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ప్రజల్లో తమ పార్టీపై మరింత నమ్మకం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇదంతా కేసిఆర్ ముందస్తు ఎన్నికల కోసమే చేస్తున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా తీవ్రమైంది.

దీనికి తగ్గట్లుగానే ఈనెల 17వ తేదీన పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.

"""/"/ ఈ సందర్భంగా కెసిఆర్ కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది .

ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున తెలంగాణలో పోటీ చేయబోయే అభ్యర్థుల వివరాల పై  కసరత్తు చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోలేదు.బిజెపి కూడా ఇప్పుడిప్పుడే బలోపేతం అవుతుంది.

ఇప్పటికిప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగితే బిజెపి అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి ఉంది.

దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలను తీసుకురావడం ద్వారానే బిఆర్ఎస్ ను గట్టెక్కించగలము అని కేసీఆర్ బలం గా నమ్ముతున్నారు.

అందుకే సైలెంట్ గానే ముందస్తు ఎన్నికల ప్రక్రియకు తెరతీసున్నట్టుగా కనిపిస్తున్నారు.

న్యాచురల్ స్టార్ నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

న్యాచురల్ స్టార్ నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!