బీజేపీ ఎఫెక్ట్‌తో యూత్‌ను ప‌క్క‌న పెడుతున్న కేసీఆర్‌.. వారి ఓట్లే కావాల‌ట‌!

ఏ రాజ‌కీయ పార్టీకి అయినా యూత్ ఓట్లు చాలా ముఖ్యం.యూత్‌లో ప‌ట్టు ఉంటే ఆటోమేటిక్‌గా ఆ పార్టీకి ప‌ది కాలాల పాటు గుర్తింపు ఉంటుంది.

ఎందుకంటే పార్టీ ఏ నిర‌స‌న చేసినా అందులో పాల్గొనేది యూత్ మాత్ర‌మే.అంతే కాదు ఎలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా దాన్ని స‌క్సెస్ చేసేది కూడా యూత్ మాత్ర‌మే.

అంత ప్రాముఖ్య‌మైన యూత్‌ను మొద‌ట బాగానే ఆక‌ట్టుకున్న కేసీఆర్‌ ఆ త‌ర్వాత దూరం చేసుకున్నార‌నే చెప్పాలి.

ఇక బీజేపీ రాక‌తో ఆ యూత్ మొత్తం బండి సంజ‌య్ ఖాతాలోకి వెళ్లిపోయారు.

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో యూత్ మొత్తం కాషాయ జెండా వైపు మ‌ళ్లుతోంది.దీంతో కేసీఆర్ కూడా అల‌ర్ట్ అయ్యారు.

యూత్ ఎప్పుడూ ఒక వైపు ఉండ‌ర‌ని, వారు ఎమోష‌న్‌కు లోన‌య్యి ఎటువైపు అయినా మ‌ళ్లుతారు కాబ‌ట్టి వారిని ప‌క్క‌న పెట్ట‌డానికి కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారంట‌.

అందుకే యూత్‌కు ఉపాధి మార్గం చూపించ‌డం కంటే కూడా పెద్ద వాళ్ల‌కు ఆస‌రాగా పింఛ‌న్లు, రైతుల‌కు రైతుబంధు లాంటివి పెడితే వారి ఓట్లు ఎటూ పోవ‌ని, వారంతా త‌న‌కే గంప‌గుత్త‌గా ఓట్లు వేస్తార‌ని కేసీఆర్ భావించారు.

అందుకే అప్ప‌టి నుంచి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ కేవ‌లం పెద్ద వ‌య‌స్కుల వారినే టార్గెట్ గా పెట్టుకుని స్కీములు పెడుతున్నారు.

"""/"/ ఇక యూత్‌కు ఉద్యోగాలు ఇచ్చినా కూడా వారు టీఆర్ ఎస్‌కు ఓటు వేస్తార‌నే గ్యారంటీ లేక‌పోవ‌డంతో మ‌ధ్య‌, వృద్ధాప్య ఓట్ల‌నే న‌మ్ముకుంటున్నారంట కేసీఆర్‌.

అందుకే కులాల వారీగా స్కీములు పెట్ట‌డానికి కూడా కార‌ణం అదేనంట‌.మ‌రి కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు వేసిన‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు యూత్ మాత్రం టీఆర్ ఎస్‌కు దూర‌మైంద‌నే చెప్పాలి.

అయితే టీఆర్ ఎస్‌కు యూత్ దూర‌మ‌యితే మాత్రం అది రానున్న రోజుల్లో పెద్ద దెబ్బే త‌గులుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మ‌రి కేసీఆర్ ఆ మేర‌కైనా యూత్ ను ద‌గ్గ‌ర తీసుకుంటారా లేదా అన్న‌ది మాత్రం చూడాలి.

ఆ ఇద్దరమ్మాయిలు ప్రేమించి మోసం చేశారు.. షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!