కేసీఆర్ మాటమీద నిలబడే మనిషి కాదు:వైఎస్ షర్మిల

మాట మీద నిలబడడం కేసీఆర్ కు చేతకాదు.ఎనిమిదేళ్ళుగా కేసీఆర్ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు.

పేదలంటే కేసీఆర్ కు పురుగుల్లా కనిపిస్తారు.ప్రతిపక్షాలను సంకలో పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.

బంగారు తెలంగాణా కాదు,బార్ల,బీర్ల తెలంగాణగా మార్చిండు.వైఎస్సార్ సంక్షేమ పాలన కేవలం వైఎస్సార్ టిపి తోనే సాధ్యం.

-112వ రోజు పాదయాత్రలో వైఎస్ షర్మిల.సూర్యాపేట జిల్లా:వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్.

షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర 112వ రోజు హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం మర్రికుంట నుంచి శనివారం ఉదయం ప్రారంభమైంది.

షర్మిల పాదయాత్ర పోనుగోడు,రామచంద్రాపురం, కోదండరామాపురం,కమలానగర్,గరిడేపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా సాగనున్నది.గరిడేపల్లి గ్రామంలో 1500 కి.

మీ.మైలు రాయి దాటనున్న షర్మిల పాదయాత్ర.

సాయంత్రం గరిడేపల్లి మండల కేంద్రంలో గ్రామస్థులతో షర్మిల మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొననున్నారు.పొనుగొడు గ్రామానికి పాదయాత్ర చేరుకున్న నేపథ్యంలో గ్రామస్థులు ఆమెకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.

వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె వైఎస్ వీరాభిమాని నర్సిరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్ళి వైఎస్సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

వైఎస్సార్ పై ఉన్న అమితమైన అభిమానంతో నర్సిరెడ్డి తమ పిల్లలకు రాజశేఖర్ రెడ్డి,షర్మిల,జగన్ మోహన్ రెడ్డి పేర్లను పెట్టుకోవడం విశేషం.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ 8 ఏళ్లుగా కేసీఅర్ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని,మాట ఇవ్వడం మాట మీద నిలబడటం అంటే కేసిస్ కు తెలియదన్నారు.

రాష్ట్రాన్ని చేతిలో పెడితే కేసీఅర్ అప్పుల కుప్పలా చేశాడని,ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పులు మోపారని,4 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ప్రయోజనం లేదని దుయ్యబట్టారు.

పేదవాళ్లు అంటే కేసీఅర్ కు పురుగుల్లా కనిపిస్తారని,బడులు,గుడులు లేవు కానీ, మద్యం మాత్రం అంతటా ఏరులై పారుతుందన్నారు.

బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఅర్ తాగుబోతుల తెలంగాణ చేశారని,ఇది బంగారు తెలంగాణ కాదు,బార్ల తెలంగాణ,బీర్ల తెలంగాణ అని ఎద్దేవా చేశారు.

ఓట్లు కావాల్సి వచ్చినపుడు మాత్రమే కేసీఅర్ బయటకు వస్తారని,గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడన్నారు.

ప్రశ్నించాల్సిన ప్రతి పక్షాలు కేసీఅర్ సంకన ఎక్కాయని,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడుపోయారని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 70 వేల కోట్ల కమీషన్లు కేసీఆర్ తీసుకున్నాడని,బీజేపీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్తోంది,కానీ బయటపెట్టదని, అందరూ దొంగలే,వారి రాజకీయ ప్రయోజనాలే వారికి ముఖ్యమని తెలిపారు.

పాలకులు తెలంగాణలో సమస్యలు లేవని చెప్తున్నారని,కానీ,అడుగడుగునా సమస్యలే ఉన్నాయని,మీ సమస్యలను ఎత్తి చూపేందుకు రాజన్న బిడ్డ కుటుంబాన్ని వదిలేసి పాదయాత్ర చేస్తుందని చెప్పారు.

ప్రజల పక్షాన రాజన్న బిడ్డ నిలబడిందని,వైఎస్సార్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయినా వైఎస్సార్ మీకు కొత్త కాదని గుర్తు చేశారు.

వైఎస్సార్ ను అభిమానించే ప్రతి ఇంటిపై వైఎస్సార్ జెండా రెపరెపలాడాలని,వైఎస్సార్ సంక్షేమం వైఎస్సార్ తెలంగాణ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

వైరల్ వీడియో: ఒంటి చేత్తో 90 లక్షల విలువైన క్యాచ్ ను పట్టుకున్న వీక్షకుడు