మరో సంచలన పథకం ప్రకటన దిశగా అడుగులేస్తున్న కెసీఆర్.. అదేంటంటే?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.ఇప్పటికే కెసీఆర్ టార్గెట్ గా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దూసుకెళ్తున్న తరుణంలో కెసీఆర్ ఏ మాత్రం స్పందించని పరిస్థితి ఉంది.

అయితే ప్రతిపక్షాలు మాత్రం ఎక్కడా తగ్గేది లేదన్నట్టుగా కెసీఆర్ టార్గెట్ గా రకరకాల శృతిమించిన విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

అయినా కనీసం ఏ మాత్రం స్పందించకుండా కేవలం పాలనపై మాత్రమే దృష్టి పెడుతూ పరోక్షంగా ప్రతిపక్షాలకు సమాధానం ఇస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికే ప్రజాకర్షక పధకాలతో దేశంలో తెలంగానకంటూ ప్రత్యేకంగా గుర్తింపును సాధించేలా కృషి చేసిన కెసీఆర్ ఇక త్వరలో మరో సంచలన పధకాన్ని ప్రకటించేందుకు రెడీ అవుతున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే రైతులను దృష్టిలో పెట్టుకొని రైతు బీమా, రైతు బంధు లాంటి పధకాలను కొనసాగిస్తున్న కెసీఆర్ త్వరలో సన్న, చిన్న కారు రైతులకు నెలకు 2016 రూపాయలు పెన్షన్ వచ్చేలా ఒక పధకాన్ని రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఈ పధకానికి ఎంతగా ఖర్చు అయ్యే అవకాశముందనే కోణంలో ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

ఏది ఏమైనా ఈ పధకం అమలుకు నోచుకుంటే కెసీఆర్ కు మరో సారి రైతులు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది.

"""/"/ ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన రాకున్నా సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాలలో కావచ్చు ఈ వార్త చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా తెర వెనుక కెసీఆర్ భారీ వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కెసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.

మరి కెసీఆర్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.

వైఎస్ఆర్‎సీపీలో వైఎస్ఆర్ లేడు..: షర్మిల