ఇక ప్రారంభోత్సవాలు సభలు సమావేశాలు ! అబ్బో కేసీఆర్ బిజీ బిజీ ? 

టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీలో ఉత్సాహం పెంచేందుకు,  2023 ఎన్నికల్లో గెలిచేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

దీనిలో భాగంగానే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ వరుసగా పర్యటనలు  చేపట్టబోతున్నారు.

ఈ జిల్లాల పర్యటనలోనే అనేక ప్రారంభోత్సవాలు ఆయన చేయబోతున్నారు.  ముఖ్యంగా జిల్లాలో సమీకృత జిల్లా కలెక్టరేట్ లతో పాటు, పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించి భారీ ఎత్తున బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

ఈ జిల్లాల పర్యటనలోనే పార్టీ కీలక నాయకులు అందరితోనూ సమీక్షలు నిర్వహించి గ్రూపు రాజకీయాలు తలెత్తకుండా చేసి ఉమ్మడిగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసే విధంగా కేసీఆర్ దిశా నిర్దేశం చేయబోతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఏవిధంగా అందుతున్నాయి ? దీనిపై సంతృప్తి ఎంతవరకు ఉంది ? పార్టీ ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజలలో జరుగుతున్న చర్చ ఏమిటి ? ఇలా అనేక అంశాలను తెలుసు కునేందుకు ఈనెల 11వ తేదీ నుంచి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు.

ముందుగా తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తారు.12వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు.

ఆ తర్వాత జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించబోతున్నట్లు సమాచారం.

"""/" / తెలంగాణలో 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది.కేవలం సిద్దిపేటలో 2020 డిసెంబర్ 10న టిఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు.

మిగతా చోట్ల పార్టీ కార్యాలయాలను ప్రారంభించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.

ప్రతి జిల్లాలోనూ సమీకృత కలెక్టరేట్ భవనాలు,  పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించనున్నారు.ప్రతి జిల్లాలోనూ సమీకృత కలెక్టరేట్ భవనాలను, పార్టీ జిల్లా కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు.

ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులను కేసీఆర్ ప్రకటించారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ పర్యటనలు కొనసాగబోతున్నాయి.

ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. మంచి భర్త దొరికాడు.. వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్ వైరల్!