క్యాబినెట్ ప్రక్షాళన చేయబోతున్న కేసీఆర్ ?

ఎప్పుడు ఏ విధంగా ఊహించని ట్విస్ట్ ఇచ్చి సంచలనం సృష్టిస్తారో ఆయనే కేసీఆర్.

తాను అనుకున్నది చేసుకు వెళ్లడమే తప్ప దాని వల్ల తలెత్తే పరిణామాల గురించి కేసీఆర్ పెద్దగా పట్టించుకోరు.

అయితే ఆ విషయంలో ఒక్కోసారి సానుకూల ఫలితాలు వస్తే మరోసారి వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి.

అయినా కేసీఆర్ ఇవేవి పట్టించుకోడు కదా ! ప్రస్తుతం తెలంగాణాలో నడుస్తున్న హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె.

ఆ విషయంలో పట్టు విడుపు లేకుండా ప్రభుత్వం, కార్మికులు వ్యవహరిస్తుండడం అది కాస్త విపక్షాలకు ఆయుధంగా మరి ప్రభుత్వం ఇబ్బంది పడడం జరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో దాని నుంచి కాస్త ద్రుష్టి మళ్లించేందుకా అన్నట్టుగా కేసీఆర్ తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేసేందుకు సిద్ధం అవుతున్నారట.

ఇదే విషయమై పెద్ద ఎత్తున వార్తలు వెలువడుత్ర్హున్నాయి.ఈ వార్తల నేపథ్యంలో తెలంగాణ మంత్రుల్లో ఎక్కడలేని ఆందోళన మొదలైంది.

"""/"/కేసీఆర్ ఒక్కసారి అనుకుంటే అది చేసి తీరుతారనే విషయం మంత్రులకు తెలియంది కాదు.

అందుకే ఎవరి పదవి ఉంటుందో, ఎవరి పదవి ఊడుతుందో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.

అయితే ఈసారి ఇద్దరిపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.మరి ఆ ఇద్దరు మంత్రులెవరు, కేసీఆర్ ఎవరిని తప్పించి ఎవరికి పదవి కట్టబోతున్నారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ఉన్న16 మంది మంత్రులను ఈ విషయం బాగా టెన్షన్‌ పెడుతున్నాయ్.దీంతో పాత మంత్రుల్లో ఎవరి సీటు ఉంటుందో ఎవరి సీటు ఊడుతుందో అనే విషయం తెలియక ఆందోళన చెందుతున్నారు.

తప్పనిసరిగా ఇద్దరికి డిమోషన్ ఇద్దరికి ప్రమోషన్ మాత్రం తప్పదనే విషయం పార్టీలో కీలక నాయకులు కొందరికి సమాచారం ఉందట.

"""/"/ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేబినెట్‌లో నలుగురు మంత్రులు ఉన్నారు.జిల్లాలో ఈటెల రాజేందర్‌కు చెక్‌ పెట్టేందుకే గంగుల కమలాకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారనే ప్రచారం నడిచింది.

అయితే కేబినెట్‌ విస్తరణ టైమ్‌లో ఎవరిని తొలిగించలేదు.కాకపోతే ఇప్పుడు కరీంనగర్‌లో జిల్లాలో నలుగురు మంత్రుల్లో ఒకరిని తప్పించబోతున్నట్టు గుసగుసలు మొదలయ్యాయి.

అలాగే గ్రేటర్ హైదరాబాద్ నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు.ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి నుండి సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ఉండగా సబితాను తీసుకున్నప్పుడే మల్లారెడ్డి తప్పిస్తారని అంతా భావించారు.

కానీ ఇప్పుడు మాత్రం గ్యారంటీ అని తెలుస్తోంది.ఇలా చెప్పుకుంటే వెళ్తే ముగ్గురు నలుగురు పేర్లు తొలిగింపు లిస్ట్ లో ఉన్నట్టు ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

అనిల్ రావిపూడిని కొట్టిన వాళ్లకు భారీ ఆఫర్ ఇచ్చిన జక్కన్న.. షాక్ లో డైరెక్టర్!