కామారెడ్డి అభివృద్ధి కోసమే కేసీఆర్ పోటీ..: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం మొత్తం కామారెడ్డి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కామారెడ్డిని వేగంగా అభివృద్ధి చేయాలనే కేసీఆర్ పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.నవంబర్ 9వ తేదీన నామినేషన్ వేసేందుకు కేసీఆర్ వస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పారిపోతున్నారని విమర్శించారు.అలాగే రేవంత్ రెడ్డికి కామారెడ్డి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు.రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు .. జరగబోయేది ఇదే