ధాన్యం కొనుగోలు చేయకుండా కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు:సంకినేని

సూర్యాపేట జిల్లా:సిఎం కేసీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు ఆరోపించారు.

బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా వైఫల్యం చెందిందని,విద్యుత్, ఆర్టీసీ చార్జిలను పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు.

వాటినుండి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికే ధర్నాల డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఏ రాష్ట్రంలో కూడా రైతుల పంటల కొనుగోలు విషయంలో ఎటువంటి గొడవలు లేవని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కేంద్రంపై విమర్శలు చేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.

రైతులు తమ ధాన్యాన్ని రూ.1600/- లకే అమ్ముకుని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార పార్టీ ధర్నాలు చేయడం విడ్డూరంగా వుందని వ్యాఖ్యానించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024