అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డ కేసీఆర్‌.. ఒక‌వైపు ఆందోళ‌న‌.. మ‌రోవైపు ఆలోచ‌న

రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఒకే విధ‌మైన ప‌రిస్థితులు ఉండ‌వు.ఎప్పుడూ ఒక‌రిదే పై చేయి అనే భావ‌న‌ను ప్ర‌జ‌లే ఒప్పుకోరు.

ఎంత భారీ మెజార్టీతో గెలిచిన నేత అయినా ఏదో ఒక స‌మ‌యంలో చ‌తికిల ప‌డాల్సిదే.

ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఇలాంటి ఇబ్బ‌దులు త‌లెత్తుతున్నాయి.ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు చివ‌ర‌కు ఆయ‌న్నే ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయి.

రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌ఈ న‌డుమ ఎందుకో ఆయ‌న వ్యూహాలు బెడిసికొడుతున్నాయి.ముఖ్యంగా బీజేపీ కొర‌క‌రాని కొయ్య‌లా త‌యార‌వుతోంది.

దుబ్బాక ఎన్నిక‌ల స‌మ‌యం నుంచే కేసీఆర్ వ్యూహాలు ఫ‌లితాన్ని తీసుకురావ‌ట్లేదు.గ‌తంలో తాను అనుస‌రించిన వ్యూహాల‌ను వ‌రుస ఉప ఎన్నిక‌ల్లో అమ‌లు చేయ‌డ‌మే బెడిసికొట్టింది.

దుబ్బాక త‌ర్వాత జీహెచ్ ఎంసీ పెద్ద షాక్ ఇస్తే.ఇప్పుడు హుజూరాబాద్ రూపంలో దారుణ‌మైన ఎదురు దెబ్బ త‌గిలింది.

దీంతో ఒక్క‌సారిగా బీజేపీ గ్రాఫ్ పెరిగిపోవ‌డం, గ్రౌండ్ లెవ‌ల్లో బీజేపీలోకి వ‌ల‌స‌లు పెరుగ‌డం కేసీఆర్‌ను ఆందోళ‌న‌లో ప‌డేశాయి.

దీంతో ఇక తానే స్వ‌యంగా రంగంలోకి దిగి సొంత వ్యూహాల‌ను ర‌చించికుంటున్నారు.ప్ర‌తి విష‌యాన్ని కూడా కూలంకుశంగా చ‌ర్చించుకుని ముందుకు వెళ్తున్నారు.

"""/"/ ఇక రాబోయే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.

గ‌తంలో లాగా సొంత స‌ర్వేల‌ను మాత్ర‌మే న‌మ్మ‌కుండా ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాల‌ని అనుకుంటున్నారంట‌.

ఆయ‌న టీమ్ తో కూడా స‌ర్వేలు చేయించి అభ్య‌ర్థుల విష‌యంలో, పార్టీ విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని చూస్తున్నారు.

కానీ ప్ర‌శాంత్ కిషోర్ ఆల్రెడీ ష‌ర్మిల‌కు సాయం చేస్తున్నారు.మ‌రి ఒకే రాష్ట్రంలో ఇరు పార్టీల‌కు సాయం అందిస్తారా లేక కేసీఆర్‌కు నో చెప్తారా అన్న‌ది వేచి చూడాలి.

ఒక‌వేళ ప్ర‌శాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో సాయం చేయ‌క‌పోయినా.కేసీఆర్ మాత్రం ప్ర‌త్యామ్నాయంగా త‌న సొంత వ్యూహాల‌ను రెడీ చేసి పెట్టుకుంటున్నారంట‌.

పవన్ కళ్యాణ్ కొత్త ఎన్నికల షెడ్యూల్..!!