దళిత బంధు పధకంపై కేసీఆర్ ఆశలు...ప్రజలు ఆహ్వానించేనా?

కేసీఆర్ ఒక పధకం ప్రవేశపెట్టాడంటే ఆ పధకం ప్రకటన వెనుక తెరవెనుక వ్యూహం వేరేలా ఉంటుంది.

చాలా మందికి అర్ధం కావడం చాలా కష్టం.తల పండిన రాజకీయ నాయకులే కేసీఆర్ వ్యూహాల్ని ప్రశంసించారంటే కేసీఆర్ వ్యూహాలకు ఉన్న బలం ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.

అయితే గత అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇంకా తెలంగాణ ప్రజలకు గుర్తుండే ఉంటాయి.

అప్పుడు కేసీఆర్ ఏమని వ్యాఖ్యానించాడంటే మా దగ్గర ఉన్న ఓ పధకాన్ని ప్రవేశపెడితే ఇక ప్రతిపక్షాల అడ్రస్ లు గల్లంతావుతాయని వ్యాఖ్యానించారు.

"""/"/ అప్పుడు కేసీఆర్ అన్న పధకమే దళిత బంధు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ఈ పధకాన్ని ఎన్నికలకు సరిగ్గా ఒక సంవత్సరం ముందు ప్రకటించాలని భావించినా ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయమే సరైన సమయమని కేసీఆర్ భావించి ఇప్పుడే దళితబంధును ప్రకటించారు.

అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టి అంతా దళిత బంధుపై పడింది.ఇప్పటికే దళితబంధు నిధులను కొంత మేర లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే.

ఏది ఏమైనా కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సైతం ఈ పధకంపైనే కేసీఆర్ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరి దళిత బంధు పధకం టీఆర్ఎస్ కు ఎంత మేర లాభం చేకూరుస్తుందనేది చూడాల్సి ఉంది.

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి