రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో రైతుల ఇబ్బందులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే( Ex CM KCR ) కారణమని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అన్నారు.

రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని చెప్పారు.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులను( Farmers ) పట్టించుకోలేదని మండిపడ్డారు.

కనీసం వర్షాలకు నష్టపోయిన రైతులకు కూడా పంట నష్టపరిహారం చెల్లించలేదని చెప్పారు.రూ.

లక్ష రుణమాఫీ సగం మంది రైతులకు చేయలేదని తెలిపారు.వర్షాలు పడలేదు కాబట్టి రిజర్వాయర్లలో నీళ్లు లేవని వెల్లడించారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయింది బీఆర్ఎస్ పాలనలోనేనన్న మంత్రి శ్రీధర్ బాబు యుద్ధ ప్రాతిపదికన పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని తెలిపారు.

ఏడుగురు దొంగలతో ఫైట్ చేసిన సింగిల్ పోలీస్.. రూ.4 కోట్లు రికవర్?