ఎనిమిదేళ్ళ పాలనలో కేసీఆర్ చేసింది శూన్యం…కుందూరు జానారెడ్డి

నల్లగొండ జిల్లా:గడిచిన ఎనిమిదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు.

గురువారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తన సొంత గ్రామం అనుముల మండల కేంద్రంలో నిర్వహించిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో అయన పాల్గొని మాట్లాడుతూ.

నియోజకవర్గ ప్రజల సహకారంతో రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలు మోసాలను ప్రజలకు వివరించడమే హాథ్ సే హాథ్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

కొంత మంది మాయమాటలు చెప్పి ఎలక్షన్ టైమ్ లో మూటల సంచులతో వచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

కేసీఆర్ 8 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసింది ఏమి లేదని,ఎన్నికల సమయంలో ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలలో దళితులకు మూడెకరాల భూమి,నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫి ఏమైందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది నేనేనని, నియోజకవర్గ పరిధిలో రోడ్లు నేనే వేశానని, అక్కడక్కడ మిలిగిన రోడ్లు కూడా వేయలేని పరిస్థితిలో ఈ కేసీఅర్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

అనుముల వాగుపై ప్రజాశక్తితో సొంతంగా చెక్ డ్యాం నిర్మిస్తానని తెలిపారు.మళ్ళీ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.

కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!!