రైతులకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారు..: మంత్రి ఉత్తమ్
TeluguStop.com
తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్( KCR ) వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ రైతులకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.కేసీఆర్ చెప్పేవన్నీ అసత్యాలేనన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది ముమ్మాటికీ కేసీఆర్ తెచ్చిన కరవేనని పేర్కొన్నారు.
పాలేరు రిజర్వాయర్( Paleru Reservoir ) కోసమే సాగర్ నుంచి నీళ్లు వదిలామని చెప్పారు.
ఉన్న నీటిని ఎలా వాడుకోవాలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు దోచుకున్నారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంలో ఏ ప్రాజెక్టుకు కరెక్ట్ డిజైన్లు లేవన్నారు.
కమీషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం( Kaleswaram ) మొదలుపెట్టారని ఆరోపించారు.మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పుడు సీఎంగా కేసీఆరే ఉన్నారని, పిల్లర్లు కుంగిన విషయంలో అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా కరెంట్ ఇస్తున్నామన్నారు.తాము దొంగ పాస్ పోర్టులు అమ్మిరాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లకు తాట తీసిన జైస్వాల్.. దిగ్గజాల సరసన చోటు