బీజేపీని ఈ విషయంలో కోలుకోలేని దెబ్బ తీసిన కేసీఆర్

దేశ ప్రజలు ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ ఎట్టకేలకు విడుదలయింది.

ఈ బడ్జెట్ పై మెజారిటీ ప్రజలందరూ పెదవి విరుస్తున్న పరిస్థితి ఉంది.ఈ తరుణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ ఒక్కసారిగా రాష్ట్ర బీజేపీని, కేంద్ర బీజేపీపై విమర్శ నాస్త్రాలు సంధించిన పరిస్థితి ఉంది.

అయితే ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్, బీజేపీని కోలుకోలేని దెబ్బ తీసిన పరిస్థితి ఉంది.

బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన 317 జీవోపై కేసీఆర్ ఇచ్చిన స్పష్టతతో చాలా మందికి ఈ జీవోపై క్లారిటీ వచ్చిన పరిస్థితి ఉంది.

జీవో 317 గొప్ప జీవో దీంతో రానున్న ఉద్యోగాల్లో 33 జిల్లాల్లో ఏ జిల్లాలో వారికి వారి జిల్లాల్లోనే ఉద్యోగాలు లభిస్తాయని ఇంత కంటే గొప్ప జీవో ఉండదని పరిపాలన తెలియని వాళ్ళే అర్ధంపర్ధం లేకుండా మాట్లాడుతారని ఇటు వంటి పార్టీ లలో యువకులు పడవద్దని కుండ బద్దలు కొట్టారు.

అయితే బీజేపీ వైఖరిని సోషల్ మీడియాలో అనుసరిస్తున్న విధానాన్ని చాలా సామాన్య ప్రజలకు అర్ధమయ్యే విధంగా విమర్శనాస్త్రాలు సంధించిన పరిస్థితి ఉంది.

అంతే కాక భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో వాతావరణాన్ని నాశనం చేసేలా వ్యవహరిస్తున్నారని, ప్రతి సారి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని రానున్న రోజుల్లో బీజేపీ నాయకులు వైఖరిని ఎండగడుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ బడ్జెట్ తో ప్రజలకు కలిగిన లాభంపై కాని, తాను అభ్యంతరం వ్యక్తం చేసిన వాటిని తప్పు అని నిరూపించగలరా అని బీజేపీ కి సవాల్ విసిరారు.

ప్రాణాలకు తెగించి తెలంగాణను తెచ్చుకున్నామని తెలంగాణలో అల్లకల్లోలం సృష్టిస్తామంటే ఊరుకునేది లేదని బీజేపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఇక రేపు నన్ను ఇక బూతులతో ప్రెస్ మీట్లు పెడతారని బీజేపీ ని మరో కోణంలో ప్రజలకు పరిచయం చేసి బీజేపీని కొలుకోలేని దెబ్బ తీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వావ్, 3 గంటల్లోనే మర్డర్ కేస్ సాల్వ్ చేసిన ముంబై పోలీస్..!