కేసీఆర్‎కు మరో ఎదురుదెబ్బ..అడ్రస్ లేని కొత్త పింఛన్లు..

తెలంగాణలో కొత్తగా ఇవ్వాల్సిన ఆసరా పించన్లు అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మూడున్నరేళ్లుగా నూతన పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో వారి అవస్థలు కొనసాగుతున్నాయి.మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో.

పెండింగ్‌లో ఉన్నవాటితోపాటు 57 ఏళ్ల వయసు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఏప్రిల్‌ గడిచినా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంపై ఆ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

65 ఏళ్లు పైబడిన వారు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు చెందిన 3.

3 లక్షల దరఖాస్తులను మండల, పంచాయతీ కార్యాలయాల్లో పరిష్కరించినప్పటికీ.రాష్ట్రస్థాయిలో ఆమోదం లభించకపోవడంతో వారికి పింఛను అందడం లేదు.

ఈ దరఖాస్తులన్నీ రాష్ట్రస్థాయి లాగిన్‌లో నిలిచిపోయాయి.రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, క్షేత్రస్థాయి అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదని దరఖాస్తుదారులు చెబుతున్నారు.

గతంలో పెండింగ్‌లో ఉన్నవాటితోపాటు వృద్ధాప్య పింఛను అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించడంతో వచ్చిన 7.

8 లక్షలకు పైగా దరఖాస్తుల పరిశీలనకు అధికారిక ఆదేశాలు జారీ కాలేదు.దీంతో రాష్ట్రంలో ఆసరా పింఛను కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 11 లక్షలు దాటినట్లు గణాంకాలు వల్లడిస్తున్నాయి.

"""/" / రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లకు 2021 ఆగస్టు వరకు అర్హత వయసు 65 ఏళ్లుగా ఉంది.

వితంతువులు, దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఆసరా అందిస్తోంది.టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నాటికి పెండింగ్‌లో ఉన్నవి, ఆ తర్వాత అందిన దరఖాస్తులకు పింఛను మంజూరు కాలేదు.

హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించిన ప్రభుత్వం మిగతా నియోజకవర్గాల్లో పట్టించుకోలేదు.

నెలకు సక్రమంగా పించను వస్తే వ్యక్తిగత, ఆరోగ్య ఖర్చుల, రోజువారీ జీవన అవసరాలు తీరుతాయని దరఖాస్తుదారులు భావిస్తున్నా.

వారికి ఆసరా లభించడం లేదు.గత బడ్జెట్ లో పింఛన్లకు రూ.

11,728 కోట్ల నిధులను కేటాయించినప్పటికీ దరఖాస్తుదారులకు నిరాశే ఎదురవుతోంది.

Video Viral: మొసలి నోట్లో పడ్డ తాబేలు.. చివరికి..?