ప్రజల ప్రాణాలంటే కేసీఆర్ ప్రభుత్వానికి లెక్కలేదు..: రేవంత్ రెడ్డి
TeluguStop.com
తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ప్రభుత్వం వరదల్లో మునిగిపోయిందని విమర్శించారు.
సీఎం మత్తు వదలాలి, ప్రజల దగ్గరకు రావాలని తెలిపారు.రాష్ట్రం అంతా వరదలతో అల్లకల్లోలం అవుతుంటే సీఎం కానీ, మంత్రులు కానీ వరద బాధిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు.
ప్రగతిభవన్ లో చనిపోయిన కుక్కకు ఉన్న విలువ ప్రజలకు లేదా అని నిలదీశారు.
బాధితుల కోసం కేంద్రం తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రజల ప్రాణాలంటే కేసీఆర్ సర్కార్ కు లెక్కలేదని విమర్శించిన ఆయన ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గజిని2 విషయంలో అల్లు అరవింద్ రిస్క్ తీసుకుంటున్నారా.. అలా చేస్తే ఇబ్బందే!