ఢిల్లీకి కేసీఆర్.. వెంట ప్రకాష్ రాజ్ ? ఏం జరగబోతోంది ?

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు.గత కొంత కాలంగా అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి అనేకమంది ప్రముఖులను కలిశారు.

  దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు.

దీనికి రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సైతం తగిన సహకారం అందిస్తున్నారు.

దీంతో దేశ వ్యాప్తంగా టిఆర్ఎస్ ను కీలకం చేయడంతో పాటు , జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకునేందుకు కేసిఆర్ ఆరాటపడుతున్నారు.

కొద్దిరోజుల క్రితమే ముంబైకి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కెసిఆర్ చర్చలు జరిపారు .

ఆ సమయంలో ఆయన వెంట సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు.

ఇక రెండు రోజుల క్రితం ప్రకాష్ రాజ్ , ప్రశాంత్ కిషోర్ తో ను కేసీఆర్ ఫామ్ హౌస్ లో చర్చలు జరిపారు.

ఈ చర్చలు ముగిసిన అనంతరం ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఢిల్లీ టూర్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ప్రత్యేకంగా సమావేశం కాబోతునట్లు సమాచారం.

మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉండబోతున్నారు.ఈ సందర్భంగా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకో బోతున్నారు.

అలాగే ప్రకాష్ రాజ్ సైతం ఈ టూర్ లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

"""/" / ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపి కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నం అయ్యింది.

ఇటు కేసీఆర్ సైతం అదే పనిపై బిజీ బిజీగా గడుపుతున్నారు వీరంతా ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోనే ముందుకు వెళుతుండటం మరింత ఆసక్తి కలిగిస్తోంది.

  2024 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాకుండా చేయడమే ఏకైక లక్ష్యంగా వీరంతా పనిచేస్తున్నారు.

హీరోగా గోపిచంద్ కెరియర్ ముగిసినట్టేనా..?