పెడేల్‌ పెడేల్‌మని వాయించడంలో ఇద్దరిదీ ఒకటే మాట..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ.

ఒక్క విషయంలో మాత్రం ఈ ఇద్దరూ ఒకే మాట మీద ఉంటున్నారు.అన్నదమ్ముల్లా విడిపోయి అభివృద్ధిలో పోటీ పడదాం అని రాష్ట్రం విడిపోయే సమయంలో రెండు రాష్ట్రాల ప్రజలు అనుకున్నారు.

ఈ ఇద్దరు సీఎంలు మాత్రం అభివృద్ధిలో కాదు కానీ.ప్రజల నడ్డి విరవడంలో పోటీ పడుతున్నారు.

ఒకర్ని చూసి మరొకరు ప్రజలపై భారం మోపుతున్నారు.మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన జగన్‌.

వచ్చీ రాగానే వాటి ధరలను రెట్టింపు చేశారు.అదేమంటే.

రేట్లు భారీగా పెంచేస్తే జనం తాగడం తక్కువ చేస్తారని ఓ వింత లాజిక్‌ చెప్పారు.

"""/"/వాళ్లు తాగడం మానారో లేదో కానీ ప్రభుత్వానికి దీని వల్ల భారీగా ఆదాయం వస్తోంది.

ఇప్పుడు ఏపీని చూసి తెలంగాణలో కూడా మందు ధరలను పెంచేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

దీనిద్వారా ఏడాదికి అదనంగా రూ.4 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోనున్నారు.

అదేమని అడిగితే.ఏపీలో పెంచలేదా.

అయినా వాళ్లతో పోలిస్తే మేం పెంచింది చాలా తక్కువే అని సమర్థించుకుంటున్నారు. """/"/ఇక అంతకుముందే ఆర్టీసీ చార్జీలను కూడా కేసీఆర్‌ సర్కార్‌ భారీగా పెంచేసింది.

బస్సుతో సంబంధం లేకుండా అన్నింటిపైనా కిలోమీటర్‌కు 20 పైసలు వడ్డించారు.రెండు నెలల సమ్మె పోటు చివరికి ప్రజలకే భారంగా మారింది.

అది చూసి ఇటు ఏపీలోనూ ఆర్టీసీ చార్జీలు పెంచేశారు.ప్రభుత్వంలో విలీనం కోసం ఆర్టీసీ కార్మికులు ఎదురు చూస్తుంటే.

జగన్‌ సర్కార్‌ మాత్రం చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపింది.ఇక్కడా అదే డైలాగ్‌.

తెలంగాణ స్థాయిలో రేట్లు పెంచలేదు కదా అన్న సమర్థింపుతో సరిపెట్టారు.ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూనే తెలంగాణలో.

పథకాలు అమలు చేయడానికి కూడా డబ్బుల్లేవంటూ ఏపీలో ప్రజల నడ్డి విరిచే కార్యక్రమం సాగుతూనే ఉంది.

ప్రశాంత్ వర్మ Vs సుజీత్ ఇద్దరిలో ఎవరు బెస్ట్…