తెలంగాణలో ఒక్కరి పరిస్థితి మాత్రమే కష్టంగా ఉందన్న సీఎం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై యుద్దంను చాలా సీరియస్‌గానే చేస్తోంది.ఒకవైపు కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకు పెరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగితే వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని పలు హాస్పిటల్స్‌లో కరోనా కేసులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌లుగా నమోదు అయిన 11 మంది ఆరోగ్యం కుదుట పడిరదని వారికి టెస్టు నెగటివ్‌ వచ్చిందని వారిని నేడు హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ చేస్తామంటూ కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.

ఇంకా ఇతరుల పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఏమీ లేదని, అందరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా ప్రకటించారు.

కరోనా సోకిన వారిలో ఒక్కరి పరిస్థితి మాత్రం కాస్త సీరియస్‌గా ఉందని వారిని కూడా కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా.. నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ కౌంటర్ వైరల్!