ఏపీలో ఏం చేద్దాం ...? సర్వే చేయించుకున్న కేసీఆర్ ...?

తెలంగాణలో తిరుగులేని అధికారం దక్కించుకుని మరో ఐదేళ్ల వరకు ఎటువంటి డోకా లేకుండా ధీమాగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు ఓ విషయం అంతుపట్టడం లేదు.

ఆ విషయంలో ఏ విధంగా తాను ముందుకు వెళ్ళాలి అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

పక్క రాష్ట్రమైన ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మీద కక్ష తీర్చుకునే ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ కు సపోర్ట్ గా ఏపీలో సుడిగాలి పర్యటన చేయాలని కేసీఆర్ ముందుగా నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు.

అయితే కేసీఆర్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో అని తెలుసుకునేందుకు అంతా .ఆసక్తిని కూడా కనబరుస్తుండగానే.

కేసిఆర్ ఇచ్చే విషయంలో సంకట స్థితిలో పడిపోయాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తాను ఏపీలో జగన్ కి మేలు చేద్దాం అని అక్కడ ప్రచారానికి వెళ్తే సీన్ రివర్స్ అవుతుందేమో అన్న ఆందోళన కెసిఆర్ లో కనిపిస్తోంది.

ఎందుకంటే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు ప్రచారానికి వచ్చి టిడిపి కాంగ్రెస్ ఓటమికి కారణం అయ్యాడో .

తాను కూడా ఆ విధంగానే కారణం అవుతానేమో అనే సందిగ్ధంలో కేసీఆర్ ఉన్నాడు.

ఏపీలో జగన్‌కు అనుకూలంగా కేసీఆర్ ప్రచారం చేస్తే దానిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు అండ్ కో బృందం సిద్ధంగా ఉంది.

దీనిలో భాగంగానే.వైసీపీకి తాను అనుకూలంగా ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు కేసీఆర్ ఓ బృందాన్ని ఏపీకి పంపించినట్లు తెలుస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ మేరకు వారంతా ఇప్పటికే అనేక జిల్లాల్లో పర్యటించి ఏపీలో ఏంటి పరిస్థితి అనే విషయంపై కేసీఆర్ కు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆ నివేదిక ప్రకారం జగన్‌ పార్టీకి మంచి జరగాలంటే.తాను ప్రత్యక్ష ప్రచారానికి దూరంగానే ఉండాలనే విషయం ఆ నివేదికలో తేలిందట.

దీంతో ఏపీలో ప్రచారం చేసేందుకు హడావుడి పడుతున్న కేసీఆర్ కొంచెం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పరోక్షంగా జగన్ కు అన్ని విధాలా సహకరించి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడు.

ఇదే విషయంపై ఇప్పటికే పార్టీ పార్టీ కీలక నేతలతో కూడా కేసీఆర్ మంతనాలు చేశారని .

ఏ విధంగా జగన్ కు సహకరిస్తే.చంద్రబాబు ని దెబ్బకొట్టొచ్చు అనే విషయంలో క్లారిటీ తెచ్చుకునే పనిలో పడ్డాడు కేసీఆర్.

రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి..: కేటీఆర్