వలస వెళ్తానన్న టీఆర్ఎస్ నేతకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన కేసీఆర్.. ?
TeluguStop.com
అందివచ్చే అవకాశాలను ఉపయోగించుకోవడంలో పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు ముందే ఉంటారు.నిజానికి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తారు గానీ ఇందులో నిస్వార్ధంగా సేవ చేసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చూ.
నేటి రాజకీయాల్లో కొనసాగుతున్న విధానం ఇది.ఇకపోతే నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఎన్నో జిమ్ముక్కులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
కాగా ఇక్కడ తన అభ్యర్దిని ప్రకటించిన టీయార్ఎస్ టికిట్ ఆశించిన మిగతా వారిలో అసంతృప్తిని రగిలించింది.
దీంతో ఈ ఉప ఎన్నికలో టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి టికిట్ దక్కకపోవడంతో, బీజేపీ తరఫున నాగార్జునసాగర్‌కు పోటీ చేయనున్నట్లు వార్తలు ప్రచారం జరిగాయి.
దీంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జగదీశ్ రెడ్డి ఆయనను ప్రగతి భవన్‌కు తీసుకెళ్ళి కేసీఆర్‌తో మాట్లాడించగా, ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని పార్టీ అధినేత హామీ ఇవ్వడంతో చల్లబడ్డారట.
కాగా ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుంది.
ఈ క్రమంలో మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి గుత్తా సుఖేందర్ రెడ్డి విముఖంగా ఉండడంతో కేసీఆర్ ఈ హమీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.