మహారాష్ట్రకు కేసీఆర్.. నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ
TeluguStop.com
జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఇవాళ మహారాష్ట్రలోని నాందేడ్ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
నాందేడ్ పట్టణంలో ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి అయ్యాయి.ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు కేసీఆర్ నాందేడ్ కు బయలుదేరనున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు నాందేడ్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పించనున్నారు.అనంతరం చారిత్రక గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు సైతం హాజరుకానున్నారు.
టీఆర్ఎస్ .బీఆర్ఎస్ గా మారిన తర్వాత మొదటిసారి ఇతర రాష్ట్రాల్లో సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో మహారాష్ట్రతో పాటు ఇటు తెలంగాణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.