ఏపీలో కే‌సి‌ఆర్ టార్గెట్ కూడా అదే !

ఏపీలో ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే ఉత్తరాంధ్ర ( Coastal Andhra ) ఓటర్లే కీలకం.

గెలుపోటములను డిసైడ్ చేయడంలో ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు ప్రధాన పాత్ర వహిస్తుంది.అందుకే ఏపీలో ప్రధాన పార్టీలు అయిన టిడిపి, వైసీపీ, జనసేన లు ఉత్తరాంధ్ర పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాయి.

అందుకు తగ్గట్టుగానే అధినేతలు కూడా ఉత్తరాంధ్రలోనే ఎక్కువ పర్యటనలు చేస్తూ ఆ ప్రాంత్ర ప్రజలకు వరాల జల్లు కురిపిస్తుంటారు.

అధికార వైసీపీ ఉత్తరాంధ్ర ఓటర్లను ఆకర్శించేందుకు ఏకంగా విశాఖను రాజధానిగా చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.

"""/" / ఇక గత ఎన్నికల్లో ఓటమిపాలు అయినప్పటికి ఉత్తరాంధ్రలో టీడీపీకి బలం కాస్త ఎక్కువగానే ఉంది.

ఇటు జనసేన పార్టీ కూడా ఉత్తరాంధ్రలో బలం పెంచుకునేందుకు గట్టిగనే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ ( CM KCR ) కూడా ఉత్తరాంధ్ర పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బి‌ఆర్‌ఎస్ పార్టీతో( BRS ) జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కే‌సి‌ఆర్.ముఖ్యంగా ఏపీపైనే ఎక్కువ నజర్ ఉంచారు.

ఎందుకంటే పక్కా రాష్ట్రమే కావడంతో ముందుగా ఏపీలో బలపడాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు.ఏపీలో బి‌ఆర్‌ఎస్ ఏ మాత్రం బలపడాలన్నా ఉత్తరాంధ్ర ప్రజలను ఆకర్షించడం ఎంతో కీలకం.

అందుకే కే‌సి‌ఆర్ ఉత్తరాంధ్ర టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్నారు.ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్ ను నియమించిన సంగతి తెలిసిందే.

"""/" / ఇప్పటికే ఆయన పార్టీ విస్తరణలో నిమగ్నమై ఉన్నారు.ఇక ఉత్తరాంధ్రలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనుంది బి‌ఆర్‌ఎస్ పార్టీ.

ఈ సమ్మేళనాల్లో రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పాల్గొననున్నారు.ఈ సమ్మేళనాల్లో భాగంగా ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉండబోతున్నాయని కూడా ఆయన చెబుతున్నారు.

అలాగే విశాఖా స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా భారీగా ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నట్లు తోట చంద్రశేఖర్ చెబుతున్నారు.

కాగా ఈ ఆత్మీయ సమ్మేళనాల వల్ల బి‌ఆర్‌ఎస్ కు బలం చేకూరుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ప్రధాన పార్టీలను కాదని బి‌ఆర్‌ఎస్ ను ఆ ప్రాంత ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది ఆసక్తికర అంశం.