కేసీఆర్ ఫిట్టింగ్‌... క‌మ్యూనిస్టుల క‌ల‌వ‌రం

కేసీఆర్ ఫిట్టింగ్‌… క‌మ్యూనిస్టుల క‌ల‌వ‌రం

బ‌డుగు, బ‌ల‌హీన, పేద వ‌ర్గాల‌కు అండ‌గా, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే అజెండాగా ఉన్న‌ క‌మ్యూనిస్టు పార్టీలకు దేశంలో ప్ర‌జాధ‌ర‌ణ ఉంది.

కేసీఆర్ ఫిట్టింగ్‌… క‌మ్యూనిస్టుల క‌ల‌వ‌రం

కానీ, కొంత‌ కాలంగా ఆ పార్టీల ప్ర‌భావం క్ర‌మ‌ క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది.

కేసీఆర్ ఫిట్టింగ్‌… క‌మ్యూనిస్టుల క‌ల‌వ‌రం

అలాంటి క‌మ్యూనిస్టు ముఖ్య నేత‌ల‌తో ఇటీవ‌ల ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రిపారు.

దీంతో కేసీఆర్ వైఖ‌రి ప‌ట్ల క‌మ్యూనిస్టులు నిశ్చ‌లంగా ఉన్నారు.ఇటీవ‌ల కేసీఆర్ చేస్తున్న కామెంట్ల విష‌యంలోనూ త‌ట‌స్థంగా ఉండ‌డం చ‌ర్చ‌ణీయాంశంగా మారింది.

సీఎం కేసీఆర్ త‌న పోరాట పంథాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ క‌మ్యూనిస్టు పార్టీలు నోరు మెద‌ ప‌ని ప‌రిస్థ‌తి.

దేశానికి కొత్త రాజ్యాంగం అవ‌స‌ర‌మ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించ‌గా ఇత‌ర పార్టీల వారు తమ‌దైన శైలిలో స్పందించాయి.

కానీ, సీపీఐ మాత్రం ఆచి తూచి స్పందించింది.ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం నూత‌న రాజ్యంగం తీసుకురావాల్సిన అవ‌స‌రం లేద‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట‌రెడ్డి వెల్ల‌డించారు.

రాజ్యంగాన్ని ప‌టిష్ట ప‌రిచేందుకు స‌వ‌ర‌ణ‌లు చేయొచ్చ‌ని, దానిని బ‌లోపేతం చేసేందుకు రాజ్యంగ నిర్మాత‌లు అవ‌కాశం క‌ల్పించార‌ని చెప్పారు.

డాక్టర్ బి .ఆర్.

అంబేద్క‌ర్ సుదూర దృష్టితో, భావిత‌రాల‌కు ఉప‌యోగ‌ ప‌డేలా దేశ వైవిధ్యం, బ‌హుళ‌త్వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రాజ్యంగం ర‌చించార‌ని గుర్తు చేశారు.

కానీ, బీజేపీ, సంఘ్‌ ప‌రివార్ శ‌క్తులు రాజ్యంగాన్ని కాల‌రాసేందుకు కుట్ర‌లు చేస్తోంద‌న్నారు. """/" / రాజ్యాంగంలోని సోష‌లిజం, లౌఖిక‌వాదాల‌ను తుద‌ముట్టేంచేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఆరోపించారు.

మోడీ అధికారంలోకి వ‌చ్చాక అనేక స‌వ‌ర‌ణ‌ల‌కు పాల్ప‌డు తోంద‌న్నారు.ప్ర‌జ‌లు, కార్మకులు, రైతుల హ‌క్క‌ల‌ను కాల‌రాసే నూత‌న చ‌ట్టాలు తీసుకొస్తున్నార‌న్నారు.

రాజ్యంగ స్ఫూర్తికి కేంద్ర ప్ర‌భుత్వ పోక‌డ‌లు ఉన్నాయ‌ని, అంద‌రూ నిల‌దీయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్ బీజేపీ కి మ‌ద్ద‌తుగా ఉన్నాయ‌ని చెప్ప‌కుండా చాడా వెంక‌ట్‌రెడ్డి మాట్లాడం చ‌ర్ఛ‌ల‌కు దారితీసింది.

కేసీఆర్ ఎత్తుగ‌డ‌లో వామ‌ప‌క్షాలు చిక్కుకున్నాయ‌న‌డానికి ఇది నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

ఎవరు ఈ అలేఖ్య.. ఎందుకు ఈ రచ్చ.. అసలేం జరిగిందంటే?

ఎవరు ఈ అలేఖ్య.. ఎందుకు ఈ రచ్చ.. అసలేం జరిగిందంటే?