అంతా పాత సరుకే : బీఆర్ఎస్ లో ఆ నేతలెక్కడ ? 

టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయింది.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని అధికారానికి దూరం చేయడమే ఏకైక లక్ష్యంగా బీ ఆర్ ఎస్ పార్టీ ఏర్పాటు అయింది.

దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పార్టీలన్నీటిని ఏకం చేసి , రాబోయే ఎన్నికల నాటికి  ప్రభావం చూపించాలనే లక్ష్యంతో కెసిఆర్ బీఆర్ ఎస్ పార్టీ ఏర్పాటు చేశారు.

కేసీఆర్ పదేపదే బీజేపీ ని గద్దె దించేది తామే అని ప్రస్తావిస్తున్నారు.ఇక మల్లారెడ్డి వంటి మంత్రులైతే కెసిఆర్ ప్రధానమంత్రి అవుతారంటూ జోస్యం చెబుతున్నారు.

జాతీయస్థాయిలో టిఆర్ఎస్ ను బలోపేతం చేసినందుకు కేసిఆర్ రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు.అసలు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలతో పాటు , పార్టీ క్యాడర్ ను ఏర్పాటు చేసేందుకు కెసిఆర్ సమయత్వం అవుతున్నారు.

ఇప్పటికే ఢిల్లీలో ఆర్భాటంగా కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు.అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో పెద్దగా జాతీయ నాయకులు కనిపించకపోవడం ఎక్కువగా టిఆర్ఎస్ కు చెందిన నాయకులు,  తెలంగాణ మంత్రులు , ఎమ్మెల్యేలు,  వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వారి అనుచరులు మాత్రమే కనిపించారు.

టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల నుంచి దాదాపు 100 మందిని తీసుకువెళ్లి ఢిల్లీలో కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే బిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణకు చెందిన వారు తప్ప ఇతర రాష్ట్రాలకు చెందినవారు కనిపించడం లేదు.

"""/"/ కనీసం కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీపై అనుమానాలు మొదలవుతున్నాయి.

ఒక జాతీయ పార్టీ ఏర్పాటు అవుతున్న సమయంలో,  వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు చాలామంది హాజరు కావాల్సి ఉన్నా,  కేవలం కొద్దిమంది మాత్రమే హాజరు అయ్యారు.

ఉత్తరాది రాష్ట్రాల నుంచి అఖిలేష్ యాదవ్ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇక కర్ణాటక నుంచి కుమారస్వామి వంటి వారు హాజరయ్యారు కానీ, మిగతా బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలు, ఆ పార్టీలోని కీలక నాయకులు కానీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడం తో , బీఆర్ఎస్ జాతీయస్థాయిలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 .