హలో…! నేను కేసీఆర్ ని మాట్లాడుతున్నా…

ఎప్పుడూ భిన్నమైన వైఖరితోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తూ ఉంటారు.ఎప్పుడూ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, పార్టీకి , ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటారు.

మొన్నటి వరకు ఎవరిని లెక్క చేయని విధంగా ఉండేవారు కేసీఆర్.  ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రంగా ఉండడంతో టిఆర్ఎస్ కు ఎదురు లేకుండా ఉండేది.

కానీ కొత్త శత్రువుగా పుట్టుకొచ్చిన బిజెపి  తెలంగాణ లో ఈ మధ్యకాలంలో బాగా బలం పెంచుకుంది.

టిఆర్ఎస్ కు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తోంది.అదే విధంగా తెలంగాణలో అధికారం సంపాదించే అంతటి స్థాయిలో బలం పెంచుకుంటూ టిఆర్ఎస్ కు కంగారు పుట్టిస్తోంది.

దీనికితోడు ప్రజల్లోనూ టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న అంశాన్ని నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వస్తున్నారు.

"""/"/ ఈ క్రమంలో  గతంలో మాదిరిగా రాజకీయాలు చేస్తే లాభం ఉండదు అనే ఉద్దేశంతో , ప్రజలలో బలం పెంచుకునే అంశాలపై కెసిఆర్ దృష్టి పెట్టినట్లు గా కనిపిస్తున్నారు.

రైతులకు, ప్రజలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తూ, ఆయా వర్గాల్లో బలం పెంచుకునే కార్యక్రమాలపై కేసిఆర్ దృష్టిసారించారు.

తాజాగా ఉద్యోగులకు  ఫోన్ నేరుగా కేసీఆర్ చేస్తూ, వారి సాధక బాధకాలు అన్నిటిని, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

బదిలీలు, ట్రాన్ఫఫర్స్, ఇలా అన్నిటినీ గురించి నేరుగా ఉద్యోగులకు ఫోన్ లు చేస్తూ తెలుసుకుంటున్నారు.

అలాగే రైతులు, అనేక రంగాల్లో ఉన్న వారికి నేరుగా ఫోన్ లు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

స్వయంగా కేసీఆర్ ఫోన్ లు చేసే సరికి ఆ ఫోన్ కాల్స్ అందుకున్న వారి ఆనందానికి అవధులే లేకుండా పోతోంది.

ఇలా ఎక్కడికక్కడ అన్ని వర్గాలకు దగ్గర అయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.ఏది ఏమైనా బీజేపీ బలం తెలంగాణలో పెరగకుండా అన్ని రకాలుగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్య