రారనుకున్నారు కానీ..  అసెంబ్లీ కి వచ్చేసిన కేసీఆర్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS )ఓటమి చెందిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఆ పార్టీ అధినేత ,మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ).

ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టలేదు కేసీఆర్.  అయితే ప్రతిపక్ష నేతగా కెసిఆర్ ఉండడంతో ఆయన అసెంబ్లీకి రావాల్సిందే .

అయినా కేసీఆర్ అవేమి పట్టించుకోలేదు .డిసెంబర్ లో ఎన్నికలు జరిగి 7 నెలలు పూర్తయింది .

మొదట్లో ఆయన కాలి గాయం కారణంగా అసెంబ్లీకి హాజరు కాలేదు. """/" /   ఆ తర్వాత అవకాశం దొరికినా కేసీఆర్ ( KCR )మాత్రం అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో,  ఇక కెసిఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టరని, మొత్తం వ్యవహారాలన్నీ కేటీఆర్ , హరీష్ రావులే చక్కపెడతారని అంతా భావించారు.

కేసిఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం పై కాంగ్రెస్( Congress ) కూడా అనేక విమర్శలు చేసింది.

అవకాశం దొరికిన ప్రతిసారి కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసిరారు.

"""/" / తాజాగా తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కెసిఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.

నంది నగర్ లోని తన నివాసం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

ఆయన వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,  పాడి కౌశిక్ రెడ్డి , మాగంటి గోపీనాథ్ తో పాటు ,మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్,  జీవన్ రెడ్డి ( Balka Suman, Jeevan Reddy )వంటి వారు వెంట ఉన్నారు.

అయితే బడ్జెట్ పెడుతున్న సమయంలో ప్రతిపక్ష నేతగా తాను హాజరు కాకపోతే ప్రజల నుంచి విమర్శలు వస్తాయని కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారా లేక తరువాత జరిగే అసెంబ్లీ సమావేశాలకూ కెసిఆర్ హాజరై అధికార పార్టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని సభలో ఇరుకున పెట్టే ప్రయత్నం చేయబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఏది ఏమైనా ప్రతిపక్ష నేత హోదాలో కెసిఆర్ మొదటి సారిగా అసెంబ్లీకి హాజరు కావడం పెద్ద వార్త గానే మారింది.

చర్మం నలుపును తగ్గించే మార్గాలివి.. అస్సలు మిస్ అవ్వకండి!