కేసీఆర్ దళిత ద్రోహి.. :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ గతంలో దళితుడిని సీఎంను చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.కేసీఆర్ కేబినెట్ లో ముగ్గురే బలహీన వర్గాల వారున్నారని చెప్పారు.

కాంగ్రెస్ తోనే దళితులకు న్యాయం జరుగుతుందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల సముదాయం ఉన్న చోటే ఓటు అడుగుతామని తెలిపారు.

పెరిగిన జనాభా ప్రాతిపదికన 18 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్నారు.అయినా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ నమ్మే స్థితిలో లేరన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి5, ఆదివారం 2025