టికెట్ దక్కని సిట్టింగ్ లకు ‘ పవర్ కట్ ‘ చేసిన కేసీఆర్ !
TeluguStop.com
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( Telangana CM KCR )ప్రకటించి అప్పుడే నెల రోజులు కావొస్తోంది.
115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు.ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ను నిరాకరిస్తూ కొత్తవారికి అవకాశం కల్పించారు.
జనగామ , నరసాపూర్ , గోషామహల్, నాంపల్లి లో అభ్యర్థుల ఎంపిక వాయిదా వేశారు.
మల్కాజ్ గిరి లో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు( MLA Mainampalli Hanumantha Rao ) టికెట్ ఇచ్చిన ఆయన కుమారుడు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో అలక చెందిన ఆయన తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
దీంతో మల్కాజ్ గిరి లో కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే కసరత్తును మొదలుపెట్టారు.
"""/" /
ఇదిలా ఉంటే తాజాగా కెసిఆర్ మరో సంచల నిర్ణయం తీసుకున్నారు.
టిక్కెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల అధికారాలను తగ్గించేశారు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న పార్టీ అభ్యర్థుల పరపతిని పెంచే విధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు.
దీనిలో భాగంగానే టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల( Sitting MLAs ) మాట చెల్లుబాటు కాకుండా, ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన కొత్త అభ్యర్థుల కు అధికారులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు .
టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు , కొత్తగా టికెట్ దక్కించుకున్న వారు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్న సందర్భంలో ఎవరి వెంట వెళ్ళాలో తెలియక అయోమయానికి గురవుతుండడం, కొత్త అభ్యర్థులను పార్టీ క్యాడర్ పెద్దగా పట్టించుకోకపోవడం వంటి ఫిర్యాదులను పరిశీలించిన కేసీఆర్ టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేశారు.
"""/" /
ఇప్పటికే టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ( MLA Rekha Naik )పార్టీకి దూరమయ్యారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు రాథోడ్ బాపూరావు , సుభాష్ రెడ్డి తాటికొండ రాజయ్య, రాములు నాయక్, చెన్నమనేని రమేష్, గంప గోవర్ధన్ వంటి వారు టిక్కెట్ దక్కకపోయినా , పార్టీలోనే కొనసాగుతున్నారు.
ఇప్పటికే వారి రాజకీయ భవిష్యత్తుకు కెసిఆర్ హామీ ఇవ్వడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తామని బహిరంగంగానే వీరంతా ప్రకటించారు.
ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొంతమందికి టికెట్ నిరాకరిస్తూ ఇతరులకు అవకాశం ఇచ్చిన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పనితీరు ఏ విధంగా ఉందనే విషయంపై కేసీఆర్ ఆరా తీశారు.
పార్టీ అభ్యర్థి, సెట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తుండడంతో కేడర్ అయోమయానికి గురవుతూ ఉండడంతో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేస్తూ తాజాగా కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది.
పుష్ప 2 విడుదల… బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ?