Lasya Nandita KCR : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి కేసీఆర్ సంతాపం..!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nanditha ) మృతికి మాజీ సీఎం కేసీఆర్( KCR ) సంతాపం తెలిపారు.

ఈ క్రమంలోనే లాస్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.చిన్న వయసులో లాస్య నందిత మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.

లాస్య నందిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. """/" / మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్( Harish Rao ) లాస్య నందిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.వీరితో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

కాగా లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.దీంతో ఆమె భౌతిక కాయాన్ని కంటోన్మెంట్ లోని ఆమె నివాసానికి తరలించనున్నారు.

బాలయ్య ఎన్టీఆర్ ను ఇప్పటికైనా క్షమిస్తాడా.. తమ కుటుంబంలో కలుపుకొంటాడా?