ఆ చవకబారు పబ్లిసిటీ వద్దన్న కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వంకు చెందిన కొందరు అధికారులు పబ్లిసిటీ చేసేందుకు సిద్దం అయ్యారు.

పలు మాద్యమాల ద్వారా అభివృద్ది కార్యక్రమాలను ప్రచారం చేయాలని నిర్ణయించారు.అదే సమయంలో ఆర్టీసీ బస్సులు మరియు ఇతరత్ర వాహనాలపై కూడా సీఎం కేసీఆర్‌ ఫొటో వేసి ఈ ప్రచారం నిర్వహించాలని అధికారులు భావించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అభివృద్ది మరియు సంక్షేమ పథకాలు అనేవి వారికి అందితే చాలు.అవే పబ్లిసిటీ అవుతాయి.

వాటిని ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదన్నాడు.చవకబారు పబ్లిసిటీ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రభుత్వం పరువు పోవడంతో పాటు డబ్బులు వృదా అంటూ కేసీఆర్‌ అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్‌ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసే విషయమై అధికారులు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు.