దెబ్బపడింది .. రూటు మారింది ! లైన్లో పడ్డ గులాబీ కారు

మరక మంచిదే గా అనే ఓ వాణిజ్య ప్రకటన లో ఉన్నట్టుగా ఇప్పుడు దెబ్బ మార్పు కోసమే అని టీఆర్ఎస్ ను ఉద్దేశించి డైలాగులు వస్తున్నాయి.

తెలంగాణాలో అడ్డు, అదుపూ లేదన్నట్టుగా టీఆర్ఎస్ కారు దూకుడుగా ముందుకు దూసుకుపోయింది.అయితే ఆ దూకుడుకి తెలంగాణ లోక్ సభ ఫలితాలు షాక్ ఇచ్చాయి.

16 స్థానాల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ పార్టీకి కేవలం తొమ్మిది స్థానాలే దక్కడంతో మింగుడుపడలేదు.

ఈ ఐదేళ్లు తమకు తిరుగేలేదు అని భావిస్తున్న సమయంలో ఫలితాలు తారుమారవ్వడంతో ఇప్పుడు పరిపాలనపై కేసీఆర్ సీరియస్ గా దృష్టిపెట్టారు.

కొద్ది రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పాలనాపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయిన కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అమలుపై సీరియస్ గా దృష్టిపెట్టారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై కూడా దృష్టి సారించారు.

పెన్షన్ల పెంపు, రైతుబంధు నిధుల విడుదల చేపట్టిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై కూడా దృష్టిసారించింది.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టు పనులను పరిశీలించి జూలైలో ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలని అధికారులకు సూచనలు చేశారు.

ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో తగిలిన షాక్ కారణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత మార్పు వచ్చిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువయ్యింది.

"""/"/ అసలు ఎవరూ ఊహించని విధంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పుంజుకోవడంతో టీఆర్ఎస్ లో కంగారు మొదలయ్యింది.

పూర్తిస్థాయిలో పరిపాలన, ఎన్నికల హామీల అమలుపై దృష్టిపెట్టకపోతే మునిగిపోవడం ఖాయమని భావించిన సీఎం కేసీఆర్ దృష్టిమొత్తం ఎన్నికల హామీల మీదే పెట్టాడు.

అంతే కాదు ఇప్పటివరకు తన మేనల్లుడు హరీష్ రావు ను దూరం పెట్టడం వల్ల ఎంత నష్టపోయామో గ్రహించి ఆయనకు పెద్ద పీట వేసేందుకు చూస్తున్నాడట.

అందులో భాగంగానే త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ప్రాధాన్యమైన పదవిని కట్టబోతున్నట్టు సమాచారం.

తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ లో బాగా మార్పు తీసుకొచ్చాయని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలా.. క్యారెట్ తో చెక్ పెట్టండిలా!